తా శ్లోకములు ఈరోజు కంఠస్తం నిమిత్తం
ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః
అర్జున ఉవాచః
నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మ యాచ్యుత
స్థితో~స్మి గతసందేహః కరిష్యే వచనం తవ! 73
స్థితో~స్మి గతసందేహః కరిష్యే వచనం తవ! 73
సంజయ ఉవాచః
ఇత్యహం వాసుదేవస్య పార్ధస్య చ మహాత్మనః
సంవాద మిమమశ్రౌషమ్ అద్భుతం రోమహర్షణమ్! 74
సంవాద మిమమశ్రౌషమ్ అద్భుతం రోమహర్షణమ్! 74
వ్యాస ప్రసాదాచ్ఛ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరమ్
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం 75
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం 75
@@@@
తాత్పర్యముః
అర్జునుడు పలికెనుః
73. అచ్యుతా నీ కృపచేత నా మూడత నశించినది. నా ఆత్మతత్త్వము యొక్క జ్ఞప్తి లభించినది. స్థైర్య మలవడినది. సంశయములు తొలగినవి. నీ మాటను అనువర్తింతును.
సంజయుడు పలికెనుః
74. వాసుదేవునకును మహాత్ముడగు అర్జునకు జరిగిన ఈ అద్భుత సంవాదమును రోమములు గగుర్పొడుచుచుండ నేనిట్లు వింటిని.
75. నాకు దివ్యచక్షువు నిచ్చిన వ్యాసునికృపచేత పరమగోప్యమైన ఈ యోగమును యోగేశ్వరుడగు కృష్ణుడు వివరించుచుండగా ఆయన యొద్దనుండియే నేను వింటిని.
ఓం నమోః నారాయణాయ
No comments:
Post a Comment