ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు
మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
అంతా మా సొంతమని అనిపిస్తావు
అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా చేసేస్తావు
మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
అంతా మా సొంతమని అనిపిస్తావు
అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా చేసేస్తావు
పెరుగుతుంది వయసని అనుకుంటాము
కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము
కళ్ళు తెరిచి నిజమేదో తెలిసేలోగా
మా కళ్ళముందు మాయతెరలు కప్పేస్తావు
కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము
కళ్ళు తెరిచి నిజమేదో తెలిసేలోగా
మా కళ్ళముందు మాయతెరలు కప్పేస్తావు
---రాజశ్రీ,బాలసుబ్రహ్మణ్యం, సత్యం.దేవుడమ్మ1973 ,
http://www.saregama.com/song/ekkado-doorana_98603
http://www.saregama.com/song/ekkado-doorana_98603
No comments:
Post a Comment