95-క.
ఉపకరణాలు: పద్యంటీకాభావము Share on FacebookShare on Twitter
విమలమతిఁదలఁప నెవ్వని
బొమముడి మాత్రమున నిఖిలభూదేవీభా
రము వాయునట్టి హరిపద
కమలమరందంబు గ్రోలు ఘనుఁడెవ్వాడో?

టీకా:
విమల = నిర్మలమైన; మతిన్ = మనస్సుతో; తలపన్ = ఆలోచించిన; ఎవ్వని = ఎవని; బొమముడి = కనుబొమలు బిగింపు; మాత్రమునన్ = మాత్రముచేతనే; నిఖిల = సమస్తమైన; భూదేవీ = భూదేవియొక్క; భారము = భారము; పాయున్ = తొలగునో; అట్టి = అటువంటి; హరి = కృష్ణుని; పద = పాదములు అను; కమల = కమలముల; మరందమున్ = మకరందమును; గ్రోలు = తాగునట్టి; ఘనుడు = గొప్పవాడు; ఎవ్వడో = ఎవరో.

భావము:
వాస్తవానికి ఆయన కనుబొమలు ఒక్కమాటు ముడిపడితే చాలు దుష్టశిక్షణ జరిగి భూభారమంతా తొలగి పోతుంది. అటువంటి ఆ దేవదేవుని పాదపద్మ మకరందాన్ని ఆస్వాదించే అదృష్టం పట్టిన మహాత్ముడే గదా ధన్యాత్ముడు.

No comments:
Post a Comment