/నెత్తురు మరకల మీదనా బంగారు తెలంగాణా
/ ఇది ఆరని నెత్తురు మరక//
/ ఇది ఆరని నెత్తురు మరక//
ఇవి ఎక్కన్నో కశ్మీర్లోనో, అల్లర్లలోనో జరిగిన కొట్లాటలల్ల తలిగిన దెబ్బలు అనుకుంటున్నారా.. కాదు మనం కొట్లాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణల బంగారంలాంటి పిల్లలు మహిళలకు తలిగిన దెబ్బలు... మా భూములు మాకేనని తిరగవడ్డ గానమా పోరు తెలంగాణమా అని తిరగవడితే మనం కోరి తెచ్చుకున్న సర్కారోల్లు ఇచ్చిన సన్మానం..
మాట్లాడితే ప్రాజెక్టులు భూమి మీద కట్టకపోతే గాలిల కడుతరా అని అడ్డదిడ్డంగా మాట్లాడుతరు కదా.. అవును గాలిల కట్టరు కానీ వీళ్ళ నెత్తురుతో కడుతరా..? వీళ్ళ సమాధుల మీద కడుతరా..? వీళ్ళేమన్న తప్పు చేశిర్రా దొంగతనం లంగతనం చేశిర్రా నెత్తురు కారేటట్టు కొట్టనీకి..??
పొద్దున్న లేస్తే రామ రాజ్యం లెక్కనే ఊదరగొడుతరు కానీ కొన్ని ఊర్లు రావణ కాష్టం లెక్క రగులుతున్నయి కానీ ఏ మీడియా పట్టిచ్చుకోదు ఎందుకంటే అంతా ఒక వర్గం హవానే నడుస్తుంది.. ఒక న్యాయపరమైన పోరాటాన్ని ఒక రాజకీయ పోరాటంగా చిత్రీకరించి నాలుగూర్ల మీదికి వేల గ్రామాల ప్రజలను వదిలే ప్రయత్నం జరుగుతుంది..
పిల్లలు లేదు మహిళలు లేదు కండ కావరంతో అందరి మీద లాఠీలెత్తి మనవాళ్ళనే పరాయోల్లలాగ చిత్రీకరిస్తున్నారు.. పరాయోల్లను నెత్తి మీద పెట్టుకొని సొంతవాళ్ళ రక్తాన్ని కళ్ళ చూస్తున్నాం.. వందల గ్రామాలు సుఖంగా ఉండాలి అన్నపుడు పది గ్రామాలను సంతోషపరచడం పెద్ద కష్టమేం కాదుగా.. ఈ ప్రాజెక్టుకు దోషులుగా వాళ్ళను నిలబెడితే చరిత్ర క్షమించదు..
తెలంగాణలో ఎర్రవల్లి , ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్, వేములఘాట్ లేవా..? మరో తెలంగాణ పోరాటాన్ని చేస్తున్న ఈ ఊర్లను ఎందుకు వెలివేస్తున్నారు..? తెలంగాణ కోసం కొట్లాడితే వాళ్ళను తెలంగాణ వాదులు వీరులు అన్నారు.. ఇప్పుడు సొంత ఊర్ల కోసం కొట్లాడితే ద్రోహులు హీనులు అంటున్నారు.. వాళ్ళ నెత్తురు మరకల మీదనా మన బంగారు తెలంగాణ నిర్మించుకునేది..? తెలంగాణ కోసం చిందించిన నెత్తురు మరకలు ఆరకముందే మరో నెత్తురు చరిత్ర మొదలవుతుంది..
No comments:
Post a Comment