

అగ్ని నీ ముఖము ; జీవాత్మ పరమాత్మ నీవే అయి ఉంటావు ; కాలం నీ నడక ; భూమండలం నీ పాదం ; వాయువు నీ శ్వాస; వరుణుడు నీ నాలుక ; దిక్కులు నీ చెవులు ; స్వర్గం నీ నాభి; సూర్యుడు నీ
దృష్టి ; నీరు నీ వీర్యం ; సముద్రాలు నీ గర్భం ; ఆకాశం నీ శిరస్సు ; ఓషదులు నీ రోమ సమూహాలు; పర్వతాలు నీ ఎముకల గూడు; చంద్రుడు నీ మనస్సు ; వేదాలు నీ ధాతువు; ధర్మశాస్త్రాలు నీ హృదయం ; ఉపనిషత్తులు నీ ముఖాలు; నీ రూపం పరతత్వం ; నీవు స్వయంప్రకాశుడవు ; శివ అనే నామం కలిగిన పరంజ్యోతివి నీవు.
No comments:
Post a Comment