రామోజీ సారూ! ఆ ప్రోగ్రాం ఏంటి ? ఆ బూతులు ఏంటి ?
అయ్యా రామోజీరావు గారు
నమస్కారం.
తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఈ టీవీ నెం.1 అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అయితే చివరాఖరికి ‘జబర్దస్త్’ బూతు కామెడీ షో' కి ఈ టీవీ కేరాఫ్ అడ్రస్ గా మారిపోతోంది.
అసలు ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ మీరు ఎపుడైనా చూసారా ? లేక చూడకుండానే టెలికాస్ట్ చేసేస్తున్నారా ?
ఈ కార్యక్రమం బాగా పాపులర్ అయిందని మీరు సంతోష పడుతూ ఉండొచ్చు.
టీఆర్ఫీ రేటింగ్ పెరిగితే యాడ్స్ పెరిగి ఆదాయం పెరగొచ్చు. కానీ మీకున్న పేరు పడిపోతోన్నది .
అది గమనించారా ?
ఈ షోలో బూతులు.. డబల్ మీనింగ్ జోకులు.. ఎడల్డ్ కంటెంట్ జోకులు తప్ప నిజమైన హాస్యం ఏమైనా ఉందా ? ఇంటిల్లిపాదీ కలసి చూడదగిన షో యేనా ఇది?
మీరు ఎపుడైనా మీ కుటుంబం తో కలసి చూసారా ? నాకైతే డౌటే. చూడకపోతే ఒక సారి చూడండి సారూ.
మీరు చూసి ఉంటే మరీ ఇంత దిగజారుడు తనం ఉండదేమో ?
అసలు మీరు ఏంటి ? మీ స్థాయి ఏంటి ? కామెడీ షో పేరిట ఇంత నేల బారు షోలు ఏంటి సారూ?
ఈటీవీలో "పాడుతా తీయగా చల్లగా" ప్రోగ్రాం వస్తోంది . ఎంత బాగుంటుంది అది . ఎలాంటి వివాదాలు, అశ్లీల వ్యాఖ్యలూ వుండవు. కుటుంబం యావత్తు చూడదగిన ప్రోగ్రాం అది. అలాంటి మంచి ప్రోగ్రాం తో మంచి పేరు తెచ్చుకున్న మీరేనా ఇలాంటి బూతు ప్రోగ్రాం చేస్తున్నది .
అసలు మీరు మీరేనా ? మరి ఇంత కమర్షియల్ గా మారి పోయారేంటి సార్.
కనీసం ఇప్పటికైనా ఈ ప్రోగ్రాం లో బూతులు ఎంత ధారాళంగా వాడేస్తారో ఒక సారి చూడండి సార్.
ఇక ఈ ప్రోగ్రాం లో జడ్జీలు ఎందుకు నవ్వుతారో అర్ధం కాదు .బూతు డైలాగులను కూడా హాస్యంగా ఆస్వాదించే జడ్జీలను తయారుచేసిన ఖ్యాతి మీదే.
ఈ షోలో డైలాగులు కామెడీ పేరుతొ రచయితల దిగజారుడుతనానికి అద్దం పడుతున్నాయి.
నాగబాబు ఈ బూతులకు విరగబడి నవ్వటం, రోజా సిగ్గు పడి మొహం చేతుల్లో దాచుకోవటం.... యధావిధిగా సూపర్, బంపర్ అని చెప్పి మార్కులు ఇచ్చేయడం. నాకు తెలీక అడుగుతాను కామెడీ అంటే బూతా ?? ఎన్ని విషయాలు లేవు వ్యంగ్యంగా చెప్పటానికి? అయినా మీకు చెప్పేంత వాడినా సారూ.
సంస్కృతి , విలువలు , సంబంధాలు, సభ్యత, సమాజం ఇతర అంశాల గురించి ఈనాడులో మీరు ఎడిటోరియల్స్ అద్భుతంగా రాస్తుంటారు/ రాయిస్తుంటారు. అన్ని కనుమరుగై పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
మరి ఇవన్నీ మీరు పాటించరా ? ఎదుటివాళ్ళ కోసమే విలువలా ? ఇదేంటి సారూ ? మరీ ఇంత ఘోరమా ?
మీ పేరు పూర్తిగా ఖరాబు కాకుండా జాగ్రత్త పడండి ? ఈ బూతు ప్రోగ్రాం పై ఓ కన్నేయండి.
లేకుంటే మీరు తీసుకున్న పద్మభూషణ్ అవార్డు పైన ఈ బూతు జబర్దస్త్ ఒక మచ్చ గా మిగిలిపోతుంది.
ఇట్లు
మీ వీరాభిమాని
ఆరుమళ్ల అప్పారావు.
No comments:
Post a Comment