పేదరికం అన్నది ఆర్ధిక స్తోమతకు సంబందించిన విషయం కాదన్నది నా అబిప్రాయం. సాధారణంగా " డబ్బు లేని వాళ్ళు పేదవాళ్ళు " అని జనబాహుళ్యంలో వున్న నిర్వచనం.
మనసులేని వాళ్లే నిజమైన పేదవాళ్ళు అని నేను ఫీలవుతాను. లేమిని నిర్ణయుంచే కొలమానం కూడా సందర్భానుసారంగా మారుతూ ఉంటుందని నా వ్యక్తిగతమయిన అభిప్రాయం.
నా అభిప్రాయంతో మీరు ఎకీభవించ లేక పొతే మీకో రెండు సందర్భాలను ఉదహరిస్తాను. ఆ రెండు సంఘటనలలో ఎవరు పేదవారిని మీరు నిర్ణయిస్తారో చూద్దాం.....
మొదటి సంఘటన:
ఒక సంపన్న మహిళ చీరల షాప్ కి వెళ్లి , "బాబూ! బాగా చౌకలో చీరలు చూపించండీ! మా అబ్బాయి వివాహం. కట్నంగా మా ఇంట్లో పని మనిషికి ఇవ్వాల్సి ఉంది." అన్నది ఆమె.
ఒక సంపన్న మహిళ చీరల షాప్ కి వెళ్లి , "బాబూ! బాగా చౌకలో చీరలు చూపించండీ! మా అబ్బాయి వివాహం. కట్నంగా మా ఇంట్లో పని మనిషికి ఇవ్వాల్సి ఉంది." అన్నది ఆమె.
అలాగే అని కొన్ని చౌక చీరలను చూపించాడు సేల్సు మెన్ .అందులోంచి ఒక చౌక చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ సంపన్న మహిళ.
కొంత సేపటి తర్వాత ఆ చీరల షాప్ కి మరొక మహిళ వచ్చి, "అన్నా! కొన్ని ఖరీదైన చీరలు చూపించు! మా యజమానురాలి కొడుకు వివాహం. ఈ సందర్భంగా మా యజమానురాలుకు కట్నం పెట్టడం కోసం నెలనెలా డబ్బులు కూడబెట్టాను. ఆమెకు ఒక మంచి చీరను కట్నంగా ఇవ్వాలి" అన్నది. అలాగే అని ఖరీదైన చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి .అందులోంచి ఒక ఖరీదైన చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ పేద మహిళ.
ఈ ఇద్దరు స్త్రీలలో ఎవరు పేదవారు?
పేదరికం ఎక్కడ ఉంది ?
పేదరికం ఎక్కడ ఉంది ?
రెండవ సంఘటన:
తన కుటుంబంతో సహా ఓ మహిళ టూర్ కు వెళ్లి అక్కడ ఒక త్రీస్టార్ హోటల్ లో బస చేసింది.. ఆ మహిళ ఒక ఆరు నెలల పాపకు తల్లి. పాప పాల కోసం ఏడుస్తుంటే ఆ మహిళ హోటల్ మేనేజర్ వద్దకు వెళ్లి " దయచేసి ఒక కప్పు పాలు ఇవ్వగలరా? " అని అడిగింది.

"తప్పకుండా మేడమ్" అని ఆయన బదులిచ్చారు." కానీ మేడమ్ మా హోటల్లో ఒక కప్పు పాలు 100 రూ॥ మేడమ్!" "పర్వాలేదు ఇవ్వండి!" అని ఆ మహిళ పాలు తీసుకుని పాపకు త్రాగించింది.
కొంత సమయం తర్వాత వారందరు అక్కడి ప్రదేశాలను చూడడానికి కారులో బయలుదేరారు.
మధ్యలో పాప మళ్ళీ ఆకలితో పాల కోసం ఏడుస్తుంటే... వారు ఒక రహదారి ప్రక్కన ఉన్న టీ స్టాల్ వద్ద కారును ఆపుకున్నారు.
మధ్యలో పాప మళ్ళీ ఆకలితో పాల కోసం ఏడుస్తుంటే... వారు ఒక రహదారి ప్రక్కన ఉన్న టీ స్టాల్ వద్ద కారును ఆపుకున్నారు.
ఆ టీ షాప్ అతని వద్ద ఒక కప్పు పాలు తీసుకుని పాపకు పట్టింది. తరువాత "ఎంత?" అని ఆమె టీ స్టాల్ వ్యక్తిని అడిగింది. "మేడమ్! మేము చిన్న పిల్లల పాలకు డబ్బు వసూలు చేయం" అన్నాడు టీ స్టాల్ వ్యక్తి నవ్వుతూ... ఎంత బలవంతపెట్టినా డబ్బులు తీసుకోలేదతను. అంతే కాదు ప్రయాణంలో పాపకు అవసరమౌతాయని మరో కప్పు పాలు పోసి ఇచ్చాడు.
ఈ రెండు సంఘటనల్లో ఎవరు పేదవారు.. ఎవరు కలవారు?
మీరు ఎవరిని పేదవాళ్ళు అంటారు?
పేదరికం ఎక్కడ ఉంది? మనస్సులోనా...గుణం లోనా... లేక దాచుకున్న సంపదలోనా??
పేదరికం ఎక్కడ ఉంది? మనస్సులోనా...గుణం లోనా... లేక దాచుకున్న సంపదలోనా??
No comments:
Post a Comment