వారి జీవితాలు ఓ కొలిక్కి తెచ్చేవరకూ
వారిలో నీ ఆనందాన్ని చూస్తూ బ్రతకాలి
నన్ను అర్థం చేసుకునేవారెవరూ
నా మనసుకో తోడెవరని నిత్యం కన్నీళ్లు పెట్టుకున్నా
కాటుక కళ్ళు కరిగిపోతాయి తప్ప బంధాల ముళ్ళు విడిపోవు
ఏ యుగమైనా
నువ్వే ఆటబొమ్మవి
నువ్వే దేవతవి
నువ్వే సహనానికి మారు పేరువి
కష్టాల కడలి దిగమింగి కడకు భూదేవమ్మ ఒడిలో కలసిన సీతమ్మది త్రేతాయుగం
అత్మాభిమానమన్న హక్కు కోసం పోరాడి గెలిచి ఓడుతున్న నేటి అవనిజలది కలికాలం
యుగాలు వేరైనా నీ పేరులోనే ఉంది రాజీతనం
ఆడదానిగా పుట్టినందుకు తప్పదు నీకీ జంఝాటం
No comments:
Post a Comment