కుంతి స్తుతి - 5:
1-191-క.
జననము, నైశ్వర్యంబును,
ధనమును, విద్యయును, గల మదచ్ఛన్ను లకిం
చనగోచరుఁడగు నిన్నున్
వినుతింపఁగ లేరు, నిఖిలవిబుధస్తుత్యా!
జననము, నైశ్వర్యంబును,
ధనమును, విద్యయును, గల మదచ్ఛన్ను లకిం
చనగోచరుఁడగు నిన్నున్
వినుతింపఁగ లేరు, నిఖిలవిబుధస్తుత్యా!
జననమున్ = పుట్టుటయు; ఐశ్వర్యంబును = సంపదయు; ధనమును = విత్తమును; విద్యయును = విద్యయును; కల = కలుగుటవలన; మదచ్ఛన్నులు = గర్వముతో కప్పబడినవారు; అకించనగోచరుఁడు = అల్పులు కాని వారికి కనబడువాడు; అగు = అయినట్టి; నిన్నున్ = నిన్ను; వినుతింపఁగన్ = కీర్తించ; లేరు = లేరు; నిఖిలవిబుధస్తుత్యా = జ్ఞానులు అందరిచేత కీర్తింపబడేవాడా (కృష్ణా).
నిష్కాములైన భక్తులకు మాత్రమే గోచరించేవాడు, నిఖిల దేవతా సంస్తూయమానుడు అయిన నిన్ను, గొప్పవంశంలో జన్మించామనీ, భోగభాగ్యలు ఉన్నాయినీ, ధనంవంతులము అనీ, విద్యావంతులము అనీ మదాంధులైన మానవుల ప్రస్తుతింపలేరు.
1-191-kaMda padyamu
jananamu naishvaryaMbunu
dhanamunu vidyayunu gala madachchhannula kiM
chanagOcharuM~Dagu ninnun
vinutiMpaM~ga lEru nikhilavibudhastutyaa!
jananamu naishvaryaMbunu
dhanamunu vidyayunu gala madachchhannula kiM
chanagOcharuM~Dagu ninnun
vinutiMpaM~ga lEru nikhilavibudhastutyaa!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
1-191-క. జననమ, నైశ్వర్యంబును, ... కుంతి స్తుతించుట : ప్రధమ స్కంధము : గ్రంధము : తెలుగు భాగవతం పద్యగద్యాలు, శ్రవణ దస్త్రములు మొదలైన వాటన్నటిని తెలుగులో సంకలనం జేసి ఒకే చోట అందిస్తోంది.
TELUGUBHAGAVATAM.ORG|BY శ్రీ ఊలపల్లి సాంబశివరావు
No comments:
Post a Comment