అంతమొంది పోతున్న ఆప్యాయతల నడుమ
బాధ్యతల బరువును మోస్తూ
జీవిత నౌకను ఒడ్డున చేర్చాలనే ఆరాటంలో
అనుబంధాల బేరసారాలతో
బంధాలను విస్మరిస్తూ
వాస్తవంతో పోరాడలేక
అస్తిత్వంతో ఓడలేక
ఓటమిని అంగీకరించలేక
కలిమిలేములు కావడి కుండలని మరచి
అంతులేని ఆశలతో
ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ
ఆశా నిరాశల నడుమ కొట్టుమిట్టాడుతూ
అంతు చిక్కని ఆవేదనలతో
బక్క చిక్కుతున్న బ్రతుకు బండి..
బాధ్యతల బరువును మోస్తూ
జీవిత నౌకను ఒడ్డున చేర్చాలనే ఆరాటంలో
అనుబంధాల బేరసారాలతో
బంధాలను విస్మరిస్తూ
వాస్తవంతో పోరాడలేక
అస్తిత్వంతో ఓడలేక
ఓటమిని అంగీకరించలేక
కలిమిలేములు కావడి కుండలని మరచి
అంతులేని ఆశలతో
ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ
ఆశా నిరాశల నడుమ కొట్టుమిట్టాడుతూ
అంతు చిక్కని ఆవేదనలతో
బక్క చిక్కుతున్న బ్రతుకు బండి..
@అమ్మ శ్రీయోగి
22.5.15
22.5.15
No comments:
Post a Comment