http://goo.gl/S4GHvx
అతిసులభం బిది యందరిపాలికి | గతియిది శ్రీపతి కైంకర్యంబు ||

పాలసముద్రము బలిమి దచ్చి కొని- | రాలరి దేవత లమృతమును |
నాలుక నిదె హరినామపుటమృతము | యేల కానరో యిహపరసుఖము ||

అడరి బాతిపడి యవని దేవతలు | బడివాయరు యజ్ఞ భాగాలకు |
విడువక చేతిలో విష్ణుప్రసాదము | కడిగడియైనది కానరుగాని ||

యెక్కుదురు దిగుదు రేడులోకములు | పక్కన దపముల బడలుచును |
చిక్కినాడు మతి స్రీవేంకటేశ్వరు- | డిక్కడితుదిపద మెఱగరుగాని

No comments:
Post a Comment