Swetha Sri Pooja added 2 new photos.
100 పోస్టులకు లక్షల మంది పోటీ పడడం కావాలా లేక లక్షల పోస్టులు క్రియేట్ చేసే స్థితి దేశంలో రావాలా ....? మీ ఓటు దేనికి ...?
మొదటిది అయితే ఆ వంద మంది మినహా మిగిలిన వారంతా దద్దమ్మల కిందే లెక్క ... అరె... సీట్లు కొద్దిగా పెట్టుకుని, కొద్ది మందినే సెలెక్ట్ చేసుకుని మిగిలిన వారిని దద్దమ్మలంటే ఎలా ...?
మన దేశానికిప్పుడు రెండోది కావాలి ... పోస్టులు పెరగాలి ...
మన దేశానికిప్పుడు రెండోది కావాలి ... పోస్టులు పెరగాలి ...
ప్రయివేటీకరణ విధానాలతో ఉన్న పోస్టులన్నీ తగ్గిపోతూ వస్తున్నాయి ... అంతేకాని మన దేశ ప్రజానీకానికి సామర్థ్యం లేక కాదు ... మన వాళ్ల సామర్థ్యం బయటకు తీసుకురావాలంటే అవకాశం ప్రతి ఒక్కరికీ కల్పించగలగాలి ... అలా కల్పించాలని ఊరకే చెబితే ప్రభుత్వాలు వినవు ... కచ్చితంగా సంఘటిత ఉద్యమాలు రావాల్సిందే ... అలా రావాలంటే రాజకీయాలుండాల్సిందే ...
మెచ్యూరిటీ ఉన్న వాళ్లకే రాజకీయాలా ....?
ఆ ఆమెచ్యూరిటీ ఎప్పుడొస్తుంది ... ? అపరపక్వం నుంచి పరిపక్వత వస్తుందా ..? లేకపోతే పరికపక్వత ఆకాశంలోంచి పుట్టుకొస్తుందా ..?
విద్యార్థి దశ నుంచే రాజకీయాలు నేర్చుకుంటూ వస్తేనే దేశాన్ని నడిపే, దిశానిర్దేశం చేసే శక్తి యువతకు వస్తుంది ... యువతకు మెచ్యూర్ అయ్యే అవకాశం ఇవ్వాలి దేశాన్ని నడపడం అనేది కొద్ది మందికే పేటెంట్ చేసి పెట్టలేదు కదా ..!
బాధ్యతలున్నవారికి బర్డెన్లు అవసరమా ...?
ఈనాడు చదువే ఒక బర్డెన్... అది బాధ్యతగా మారడం లేదు ఎందుకు ...? ఉన్న ఉద్యోగాలు కొన్ని... కానీ లక్షల మందిని తయారు చేసే పని మన విద్యా వ్యవస్థది ... చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి లింకే లేదు ... అలాంటి చదువులు ఎందుకు చదవాలి అని ప్రతి విద్యార్థి అనుకుంటున్న దశ ఇది ... కావాలంటే సర్వే చేసి చూడండి ... ఉద్యోగాలు కల్పించలేని అసమర్థత ప్రభుత్వాల వద్ద ఉన్నప్పుడు, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే ప్రయివేటీకరణ విధానాలను అమలు చేస్తున్నప్పుడు చదువులు బర్డెన్ కాక, బాధ్యత ఎలా అవుతాయి ...? ఈ బర్డెన్ దించుకోవడానికి చదువులను తమ బాధ్యతగా మార్చుకోవడానికి క్రియాశీల రాజకీయాల్లోకి రావడం నేటి విద్యార్థి బాధ్యత ... ఎందుకంటే బర్డెన్ ను బాధ్యతగా మార్చే కెపాసిటీ కేవలం రాజకీయాలకే ఉంది కాబట్టి ...
ఒకవేళ కొద్ది మందే అయినప్పటికీ కేవలం పుస్తకాల పురుగులోలె చదివి ఉన్నత స్థానాలు ఆక్రమించినప్పటికీ, అలాంటి వాళ్లు తమకు తామే తప్ప దేశానికి ఏమాత్రం ఉపయోగపడరు ... ఎందుకంటే వారు ఉపయోగపడే స్థాయి వచ్చేనాటికి సంఘ చైతన్యం ఏమీ లేకపోవడం వల్ల కెరీరిజానికి బలైపోతూ ఉంటారు ...!!!
No comments:
Post a Comment