ఇవ్వడానికి..రెండు రూపాయలకు..ఇవ్వడానికి..ఎవడిచ్చాడయ్యా..మీకు అధికారం.?ఎలా ఇస్తారు.
ఏ లెక్కలో.ఇస్తారు?.రైతుల కడుపు.. కొట్టడానికి మీరెవరు?..మీ వోట్ల కోసం... రైతులు,త్యాగం చేయాలా?రైతుల జీవితాలతో..ఆడుకుంటారా?రైతులు పండించే పంటలకు ధరలు నిర్ణయించడానికి
మీరు..నారు..పోస్తున్నారా?మడక దున్నుతున్నారా?నీళ్ళు పెడుతున్నారా?నాట్లు వేస్తున్నారా?
పంట పండిస్తున్నారా?ఎరువులు..వేస్తున్నారా?కోత కొస్తున్నారా?పొలంలో కష్ట పడుతున్నారా?డిల్లీ
లో కూర్చుని,పంటల ధరలు,ఎలా నిర్నయిస్తారయ్యా..?సగం ధర తగ్గిస్తే..ఆ నష్టం రైతులు ఎందుకు
భరించాలయ్యా..రైతుల జీవితాలతో..ఆడుకుంటారా?వాళ్ళు ఏం పాపం చేసారయ్యా?రైతు కష్టం తిని
బతకాలని..ఎందుకు కోరుకుంటా రయ్యా.రైతు కుటుంబం అర్ధాకలితో బతికేలా చేయడానికి మీకేమి అర్హత ఉంది..రైతు పండించిన పంటను కిలో బియ్యం... రూపాయికి ఇవ్వడానికో..రెండు,మూడు, రూపాయలకూ..ఐదుకో..పది రూపాయలకో ఇవ్వడానికో..మీకేమిఅర్హత ఉందయ్యా..రైతులు
.పెట్టుబడులు ఎలా తెస్తున్నారో తెలియదు.కానీ రూపాయికి,రెండు రూపాయలకు బియ్యం
చక్కర,గోదుమలు,అన్నీ ఉచితంగా ఇస్తామని..మాత్రం ప్రకటిస్తారు.ఎవడ్రా..మీరంతా.
No comments:
Post a Comment