తెల్లారిపోయింది ...
సూర్యుడు ఎవరికోసమో తొంగి తొంగి చూస్తున్నాడు .....
పచ్చని ఆకులు ముచ్చెమటలతో మునిగి ఉన్నాయి ...
మంచు రాజు నులివెచ్చగా తాకగానే కందినట్లున్నాయి ....
చిరుగాలి తెగ ఆరాటపడుతుంది..... తన నిచ్చెలి మోమును నిమురుదామని .......
సీతాకోకలు చీరను సవరించుకుంటున్నాయి...... మధువుల అధరపు స్పర్శతో .....
కుసుమాలకు సుకుమారం ఎక్కువైనట్లుంది ......పదే పదే ముడుచుకుంటున్నాయి ...
నేలమ్మ అల్లాడుతుంది .....వానచినుకుల వియోగంతో .....
మబ్బులకు ఒకటే అలజడి మొదలైంది .....ఉరుములమెరుపుల ఉక్రోషంలో..
కాలానికి సమయం సరిపోవట్లే .......ఉరుకుల పరుగుల ఉద్వేగంలో .....
కృతిమానికి కన్నుకుడుతోంది......ప్రకృతి ఆహ్లాదాన్ని చూసి ..... ......
చుట్టూ ఉన్న చెట్టు చేమకు బలే కష్టమొచ్చింది...... వింత మనుషుల ఆగడాలతో...
సంధ్యా సమయం ..పుట్టలలో పురుగులకు ...ఆకాశాన పక్షులకు మాత్రమే ...
రాతిరివేళ నిదరోయేది.......మబ్బు చాటు చీకటమ్మే ......
సుభాషిణి తోట

---------------------------------
No comments:
Post a Comment