
ఏ రోడ్డుపక్క టీ కొట్టు వద్దో బిస్కెట్లు తింటూ;చాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకొంటుంటె బాగానే ఉంటుంది.
కానీ ఆ చాయ్ కాస్తున్న; కప్పులు కడుగుతున్న చేతుల్లో వాస్తవంగా ఉండాల్సింది ఏ పలకా బలపమో;పెన్నూ పుస్తకమోనన్న తలంపు మనకెప్పుడన్నా కలుగుతోందా? వారిగురించి;వారి భవితవ్యం గురించి ఎవ్వరైనా;ఎప్పుడైనా;ఏ కొద్దిసేపైనా; ఆలోచిస్తున్నారా? సైకిళ్లు;మోటారుసైకిళ్ల మరమత్తు దుకాణాల్లో పనిచేస్తున్న పిల్లలు ఎంత మంది లేరు? నేతపని;గాజుపని;టపాకాయల తయారీ వంటి పరిశ్రమల్లో బాలకార్మికులుగా తెల్లారిపోతున్న బతుకులకు లెక్కేలేదు.ఈ దురాగతం నేటికీ మన సమాజంలో కొనసాగుతుండటం సిగ్గుచేటు.
No comments:
Post a Comment