భగవద్గీత
71 కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః| లోకసంగ్రహమేవాపి సమ్పశ్యన్కర్తుమర్హసి|| 3-20 || జనకాదులు నిష్కామ కర్మ చేతనే సంసిద్ధిని (మోక్షమును) పొందారు. లోక సంగ్రహార్థమైనా (జనులకు సన్మార్గమును చూపుటకైనా) నీవు కర్మలను చేయుటకే తగియున్నావు. యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః| స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే|| 3-21 || గొప్పవాడు ఏకర్మనుచేయునో తక్కినవారును అదేచేయుదురు. శ్రేష్ఠులు తీసికొనిన ప్రమాణమునే లోకములో తక్కిన వారందరూ అనుసరింతురు. యథా రాజా తథా ప్రజా అనే లోకోక్తి ఇదే చెబుతుంది. ఇప్పుడు దేశములోని అదర్మము, అవినీతికి మార్గ దర్శకులు (ప్రజా) నాయకులే. ### |
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ధర్మస్వరూపులు కాలస్వరూపులు
పరిపాలన కార్యాలయం హైదరాబాద్
No comments:
Post a Comment