హనుమాన్ చాలీసా:
తులసీదాసు దర్శించి రచించి ఒక మంత్రశాస్త్రం వలె అనుగ్రహించిన దివ్య మంత్రరాశి హనుమాన్ చాలీసా. తులసీదాసు భారతీయ సంస్కృతిలో హిందీ భాషకి చెందిన కవియైనప్పటికీ కూడా భారతీయులందరూ గౌరవించేటటువంటి ఋషితుల్యుడైన మహానుభావుడు. వాల్మీకి రామాయణం తర్వాత అంత ప్రసిద్ధి చెందినటువంటి రామాయణం తులసీదాసు రచించినటువంటి 'రామచరిత మానస్'. ఇది 'అవధి' అనబడే హిందీ భాషా శైలిలో రచింపబడినది. అయోధ్య పరిసరాలలో వాడబడే హిందీని 'అవధి' అంటారు. అది ఒక ప్రత్యేకమైనటువంటి భాష. తులసీదాసు జీవిత చరిత్ర కూడా విశేషంగా లభిస్తూన్నది. ఆ చరిత్ర ఒక అద్భుతంగా కనపడుతున్నది. దీనిని బట్టి తులసీదాసు సామాన్యుడు కాడు. ఒకానొక అవతార పురుషుడు అనిపిస్తున్నది. వాల్మీకి, వ్యాసుడు ఎటువంటి వారో తులసీదాసు కూడా అటువంటి వాడే. భరద్వాజ సంహితలోనైతే వాల్మీకియే తులసీదాసుగా అవతరించాడు అని ఒక చరిత్రని తెలియజేస్తున్నారు. అది ఎంతవరకు ప్రమాణం అనేది ప్రక్కన పెట్టి వాల్మీకి తరువాత తులసీదాసుకు అంత గౌరవాన్నిచ్చారు అని తెలుస్తున్నది. పైగా రామచరిత మానస్ హిందీభాషలో వారందరూ/ఔత్తరాహికులందరూ కూడా నిత్యం పారాయణ చేసి సత్ఫలితాలు పొందుతూన్నారు. అది ఒక మంత్రం శాస్త్రం వలె అద్బుతమైన మహిమ కల గ్రంథం. అనేకమైన అంశములు - నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంబంధమైన విశేషాలు ఆ గ్రంథంలో ఉన్నాయి. ఈ రామచరిత మానస్ ను అందించిన మహానుభావుడు ఆ గ్రంథం మాత్రమే కాకుండా మరొకొన్ని విషయాలను కూడా అందించారు. అది వినయ పత్రిక, గీతావళి, హనుమాన్ బాహు, సంకట మోచన హనుమాన్ స్తోత్రం, హనుమాన్ చాలీసా - ఇవి తులసీదాసు యొక్క రచనలలో మరికొన్ని ప్రసిద్ధి చెందినటువంటివి. ఇందులో హనుమాన్ చాలీసా మొత్తం భారత దేశంలో ఆబాల గోపాలమూ నిత్యమూ పారాయణ చేసుకొనే ఒక అద్భుతమైన గ్రంథమిది. ఇంత ప్రచారమూ, వ్యాప్తీ ఈ గ్రంథానికి లభించింది అంటే ఎంతటి మహాచ్ఛక్తి దీనిలో ఉన్నదో అర్థమౌతూంది. పైగా ఒకవిధంగా వైదిక భాషలో చెప్పాలంటే హనుమాన్ చాలీసాని హనుమత్ సూక్తము అని, హనుమద్ ఉపనిషత్తు అని కూడా వర్ణించవచ్చు. చిన్న చిన్న మాటలలో ఎన్నో అద్భుతమైన ఉపాసనా రహస్యాలని నిక్షిప్తం చేశారని ఇక్కడ చూపించాడు తులసీదాసు. ఒక్కొక్క పదాన్నీ, ఒక్కొక్క వాక్యాన్నీ విశ్లేషిస్తూ ఉంటే సంహితా గ్రంథాలు, రామాయణ గ్రంథాలు, పురాణ గ్రంథాలు, హనుమత్ సంబంధమైన వాజ్ఞ్మయం అంతా ఇందులో కనిపిస్తూన్నది. ముఖ్యంగా హనుమంతుని ఉపాసనా విశేషాలు, ఉపాసించడం వల్ల వచ్చే ఫలితాలు, హనుమాన్ చాలీసాలో కనపడతాయి. ఆ ఉపాస్య మంత్రములు, హనుమంతుని యొక్క గుణము, వైభవము, లీల, తత్త్వము, ప్రభావము, ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో కనపడుతున్న అద్భుత అంశాలు. అందుకు హనుమాన్ చాలీసాను ఆధారం చేసుకొని దానిని విశ్లేషిస్తూ వ్యాఖ్యానిస్తూ చెప్పుకుంటూ ఉంటే అదొక హనుమదుపాసన అవుతుంది. ఈ హనుమాన్ చాలీసా కూడా అవధి భాషలో రచింపబడినటువంటిదే. మొత్తం నలభై చౌపాయీలు, మూడు దోహాలతో ఉంటుంది హనుమాన్ చాలీసా.

No comments:
Post a Comment