UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 20 January 2015

రికార్డులను ‘ఐ’ బ్రేక్‌ చేస్తోంది - విక్రమ్‌ ---ఇప్పటివరకూ నా బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ ఇచ్చిన సినిమా ‘ఐ’. దానికి శంకర్‌తో పాటు విక్రమ్‌ ఇచ్చిన సహకారం ఎంతో ఉంది.

రికార్డులను ‘ఐ’ బ్రేక్‌ చేస్తోంది - విక్రమ్‌

‘‘అన్ని భాషల్లో ‘ఐ’ సినిమా రికార్డ్స్‌ని బ్రేక్‌ చేస్తోంది. మేం బాగా కష్టపడి చేసింది జనం చూడాలనే ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురుచూశాం. ప్రేక్షకులు చాలా ఆశ్చర్యపడుతూ, ఉద్వేగపడుతూ చూశారు. ‘ఐ’ చేయడం నా జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయం’’ అని చెప్పారు విక్రమ్‌. శంకర్‌ రూపొందించిన ‘ఐ’ చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించారు. ఈ నెల 14న విడుదలైన ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తున్నదో సోమవారం పత్రికలవారితో మాట్లాడుతూ చెప్పారు విక్రమ్‌. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
సినిమాకి చాలా ప్రచారం రావడంతో, అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అలాంటప్పుడు ప్రతి ఒక్కర్నీ తృప్తిపరచడం సాధ్యంకాదు. కొంతమంది ఇష్టపడకపోవచ్చు, కొంతమంది ఇష్టపడొచ్చు. విమర్శకులు, ఇండసీ్ట్రకి చెందిన వ్యక్తులు వేరేగా మాట్లాడొచ్చు. కానీ ప్రేక్షకులంతా ఏకపక్షంగా సినిమాని బాగా ఇష్టపడుతున్నారు. ఇది, మొదట బ్రహ్మాండమైన ఓపెనింగ్స్‌ వచ్చి, తర్వాత డ్రాపయ్యే తరహా సినిమా కాదు. విడుదలైన 14వ తేదీ నుంచి ఇప్పటిదాకా కలెక్షన్లు స్థిరంగా ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ రాషా్ట్రల్లో ఒక డబ్బింగ్‌ సినిమా ఇప్పటికే రూ. 21 కోట్లు వసూలు చేయడం చిన్న విషయం కాదు. కేరళలో 225 థియేటర్లలో విడుదలైతే, అక్కడ ఇప్పటివరకూ అత్యధికంగా వసూలు చేసిన తమిళ సినిమా కలెక్షన్లను వారం కాకమునుపే ‘ఐ’ దాటేసింది. మలయాళీలు ఈ సినిమాని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. అదే బ్యాడ్‌ ఫిల్మ్‌ అయితే ఇది సాధ్యం కాదు.
నా భార్యకు ఓర్పు ఎక్కువ
నా భార్య వెరీ సపోర్టివ్‌. ఏ భార్యయినా తను వండినది భర్త తినకపోతే బాధపడుతుంది. పాత్ర కోసం బరువు తగ్గాల్సి వచ్చినప్పుడు, ఆమె వండినది తినలేకపోయేవాణ్ణి. బిర్యానీ అంటే నాకిష్టం. అది చేసి, తినమన్నప్పుడు, నేను తిననని చెప్పేవాణ్ణి. నేను భోజనప్రియుణ్ణి. అందువల్ల ఇష్టమైనవి తినకూడని పరిస్థితి తలెత్తడంతో చాలా ఇబ్బందిపడ్డాను. కాఫీ, టీ, పెప్సీ, పిజ్జా వంటివాటికి దూరంగా ఉన్నాను. మనం కష్టపడేది తిండి కోసమే. కానీ దానికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. మొత్తానికి ఆమె నా విషయంలో చాలా ఓపికగా వ్యవహరించింది.
ఆయన ప్రశంసను మరచిపోలేను - అమీ జాక్సన్‌
‘నేను పనిచేసిన అత్యంత అందమైన తారల్లో అమీ ఒకరు. షి ఈజ్‌ ఐకాన్‌ ఫర్‌ మి’ అని లివింగ్‌ లెజెండ్‌ అయిన పీసీ శ్రీరామ్‌ (సినిమాటోగ్రాఫర్‌) ఇచ్చిన కాంప్లిమెంట్‌ను ఎప్పటికీ మరచిపోనని చెప్పింది అమీ జాక్సన్‌. ‘ఐ’లో నాయికగా నటించి ఆమె పత్రికలవారితో మాట్లాడుతూ ‘‘లివింగ్‌ లెజెండ్స్‌ వంటి శంకర్‌, విక్రమ్‌, పీసీ శ్రీరామ్‌ వంటివాళ్లతో కలిసి పనిచెయ్యడం ఎంతో గౌరవంగా భావించాను. ఈ సినిమాకు రెండున్నరేళ్లు పనిచేశాం. అయినప్పటికీ ఇది నా కెరీర్‌ దిశను మార్చే సినిమా. అందుకు తగ్గట్లే అన్ని చోట్లా ఈ సినిమా రికార్డులను క్రాస్‌ చేస్తోంది. ఇండియా మొత్తంగా అసాధారణ స్థాయిలో ఈ సినిమాని ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బీస్ట్‌ కేరక్టర్‌తో సాంగ్‌ చేసేప్పుడు మొదట విక్రమ్‌ను చూసి చాలా భయపడ్డాను. తర్వాత అలవాటుపడి, మామూలుగా చేశాను. విక్రమ్‌ జీనియస్‌. నా కెరీర్‌ మొదట్లోనే అలాంటి నటునితో పనిచేసే అవకాశం రావడం ఫెంటాస్టిక్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఇప్పటివరకూ నా బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ ఇచ్చిన సినిమా ‘ఐ’. దానికి శంకర్‌తో పాటు విక్రమ్‌ ఇచ్చిన సహకారం ఎంతో ఉంది. కెమెరా వెనుక ఉండే మెజీషియన్‌లాంటి వారు పీసీ శ్రీరామ్‌. ప్రతి నటీ ఆయనతో పనిచేయాలని కోరుకుంటుంది. రామ్‌చరణ్‌తో ‘ఎవడు’ చేసిన తర్వాత తెలుగులో కొన్ని స్ర్కిప్టులు విన్నాను. మంచి పాత్రల కోసం చూస్తున్నాను. ఈ ఏడాది తెలుగులో చేస్తానని ఆశిస్తున్నా’’ అని తెలిపింది.

No comments:

Post a Comment