కలక్షన్స్ ను దున్నేస్తున్న శంకర్ ఐ
సంచనల దర్శకుడు శంకర్ దర్శకత్వం లో ఇటివలే విడుదలైన ఐ సినిమా కలక్షన్స్ ను దున్నేస్తుంది. తెలుగులో డివైడ్ టాక్ తో రన్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే వందకోట్ల కలక్షన్స్ వసూలు చేసి బాక్స్ ఆఫీసు వద్ద తన సత్తా చాటుకుంది. విక్రమ్ , అమీ జాక్సన్ జంటగా నటించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ కలక్షన్స్ ఇలా ఉన్నాయి . ఐ సినిమా మూడు రోజుల్లోనే దాదాపు 92 కోట్ల కలక్షన్స్ వసూలు చేసింది. తమిళనాడు - 38. 11 కోట్లు, ఆంధ్రా , తెలంగాణా - 28 కోట్లు, కేరళ - 10. 04 కోట్లు, కర్ణాటక - 6. 84 కోట్లు, రెస్ట్ అఫ్ ఇండియా - 2. 86 కోట్లు, ఓవర్సీస్ - 34 కోట్లు, అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ జనవరి 16 న విడుదలైంది. హిందీలో దాదాపు 7 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం దాదాపు వందకోట్ల మార్కెట్ ను దాటింది.
No comments:
Post a Comment