చీకటి బతుకులు - సెక్స్ వర్కర్స్ తో ఇంటర్వ్యూ ....
.
.
''అందమైన లోకమని రంగురంగులుంటాయని...
అందరూ అంటుంటారు రామ రామా....
అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా...''
అంటూ ఆచార్య ఆత్రేయ ఈ లోకం గురించి 1979లో రాశాడు.
దేశం వెలిగిపోతుంది, అభివృద్ధివైపు దూసుకెళుతున్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్న ఈ దేశంలో ఆడది అంగడి సరుకుగా మారిపోయింది. ఒక వైపు పాలకులుగా, చట్టసభలకు నాయకులుగా మహిళలు ఉన్న సందర్భంలోనే దేశ నిర్మాణంలో భాగం పంచుకోవాల్సిన 3 కోట్ల మంది మహిళలు, బాలికలు నేడు నరక కూపంలాంటి వ్యభిచారంలో మ్రగ్గుతున్నారు. వీరిలో దాదాపు 60 శాతం మంది అట్టడుగు కులాలకు చెందిన వారు, 30 శాతం మంది 18 ఏండ్లు నిండని బాలికలు ఉన్నారు. 68 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో, పాలకుల నిర్లక్ష్యం మూలంగా బ్రతకడానికి ఏ ఆధారం లేక, జానెడు పొట్ట కోసం, కుటుంబాన్ని పోషించుకోవడానికి, పిల్లల భవిష్యత్ కోసం గత్యంతరం లేక ఆడది తన శరీరాన్నే పరాయివాళ్ల చేతిలో పణంగా పెడుతున్నారు. దేశంలోని ప్రతి నగరంలో ఇలాంటి వాళ్ళు నిత్యం మనకు కనిపిస్తారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామని, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లామని గొప్పలు చెప్పుకుంటున్న సమయంలో రాష్ట్ర రాజధానిలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మహాత్మాగాంధీ బస్‌స్టాండ్, పంజాగుట్టా, ట్యాంక్‌బండ్, దిల్‌సుఖ్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, ఇందిరా పార్క్ లాంటి చాలా సెంటర్స్‌లో ఇలాంటి మహిళలు వందలాది మంది కనిపిస్తారు.వ్యభిచారాన్ని జీవనోపాధిగా స్వీకరించి బహిరంగంగా తిరుగుతున్న వాళ్లు నగరంలో రెండు రకాలుగా కనిపిస్తున్నారు. కొందరు ఎవరికి వారు ఒంటరిగా ఈ వ్యాపారాన్ని చేసుకుంటుంటే, గ్రూపులుగా ఏర్పడి ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న వారు ఇంకొందరు. కాకినాడ, వైజాగ్, రాజమండ్రి వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా గ్రూపులుగా ఉంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు మాత్రం ఒంటరిగానే వ్యభిచారాన్ని చేస్తున్నారు. గ్రూపుల కింద ఉండేవారు నెలసరి కాంట్రాక్ట్ కింద ఒక నిర్వాహకురాలి కింద ఈ వ్యభిచారాన్ని జీవనోపాధిగా స్వీకరిస్తున్నారు. వాళ్ల ఫుడ్డ్, బెడ్ అంతా చూసుకుంటాను అనే పేరుతో ఒక్కొక్క మనిషి మీద ఆ నిర్వాహకురాలు ఈజీగా 30 వేలు సంపాధిస్తుంటే, ప్రతి రాత్రీ 6 గురు మనుషులకు తన శరీరాన్ని పణంగా పెట్టే వీళ్లకు మాత్రం నెలకు పదిహేను వేల రూపాయలు మాత్రమే మిగులుతాయంటారు.
తమ పిల్లల చదువులు సాగాలన్నా, తమ భర్తలు చేసిన అప్పులు తీరాలన్నా ఈ కష్టాలు తప్పవంటారు. వ్యభిచారిన్ని జీవనాధారంగా నమ్ముకొని నాలుగు గోడలు దాటి నగరం బాట పట్టిన ప్రతి ఆడవారి వెనుక ఒక విషాదమైన జీవితం దాగుంది. ఈ జీవితాన్ని నమ్ముకున్న వాళ్లలో పదిహేనేళ్ల బాలికల నుంచి 45 ఏండ్ల ఆడాళ్ల వరకు ఉన్నారు. వీళ్లు శరీరాన్ని పణంగా పెడుతున్నా చాలా సార్లు కష్టమర్లు డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నాయంటున్నారు. తాగుబోతుగాళ్లు హత్యలు, హత్యాచారాలు చేసిన సంఘటలు కూడా ఉన్నాయి. ప్రతి రోజు ఈ వృత్తికోసం రోడు్డపౖకి వచ్చాక తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతామనే నమ్మకం లేదంటున్నారు వీళ్లు. అయితే రోడ్డుమీదకు వచ్చే ఈ ఆడాళ్లకు గుట్టుచప్పుడు కాకుండా హోటళ్లలో వ్యభిచారాన్ని నిర్వహించే కాల్‌గర్స్‌కు చాలా తేడ ఉంది. వీళ్లంతా తమ కుటుంబ పోషణ కోసం ఈ వృత్తిని ఎంచుకుంటే హోటళ్లలో వ్యభిచారం చేసే కాల్‌గర్స్ల్ లగ్జర్లకు, ఫ్యాషన్లకోసం శరీరాన్ని అమ్ముకుంటుంటారు. రోడ్లమీద వ్యభిచారం చేసుకునే వాళ్లు సిటీ మొత్తం మీద మూడు వేల మంది ఉంటే, కాల్‌గర్స్ల్ మాత్రం ఐదు వేల మందిపైగానే ఉన్నారంటున్నారు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. ఇలా హైదరాబాద్‌లోని ఒక్కో సెంటర్ ఒక కథ చెబుతుంది. వెలుగులో ఉండేవారు చీకట్లో బతుకుతుంటే, చీకట్లో ఉండేవాళ్లు వెలుగుకోసం తపిస్తున్నారు. నాలుగు గోడల మధ్య రహస్యంగా సంసారం చేసుకునే ఈ ఆడవాళ్లు రోడ్లపాలు కావడం వెను ఒక్కోక్కరిది ఒక్కో కథ...హైదరాబాద్ అభివృద్ధి వెలుగు నీడలవెనుక దాగున్న చీకటి బతుకులను పాఠకుల దృష్టికి తీసుకొచ్చెందుకు ముగ్గురం మిత్రులం ఒక పత్రిక కొసం హైదరాబాద్ నగరంలోని కొంతమంది సెక్స్ వర్కర్స్ తో చేసిన ఇంటర్వ్యూ ఇక్కడ తొందర్లోనే మీ ముందుంచుతాను ...

No comments:
Post a Comment