........ఓం నమ శివాయ.........
!! జ్వాలాలింగ ఆవిర్భావం !!
👉 బ్రహ్మ మహావిష్ణువుల ఆధిపత్యం పోరులొ భాగంగా... బ్రహ్మ వైపు నుంచి పాశుపతాస్త్రము...విష్ణువు వైపు నుంచి మహేశ్వరాస్త్రం... పరమేశ్వర ప్రసాధితములైన ఆ రెండు ధివ్యాస్త్రములు చండ్రప్రచండ ప్రళయాగ్ని జ్వాలలు కక్కుతూ "యెదురు - బెదురు"గా డీకొంటూ వస్తూంటే ఒక్కసారిగా......
👉 ధివ్య శంఖారావాలు మార్మోగుతుండగా... ధివ్య డమరక నాథాలు హోరెత్తుతుండగా... పాతాళాన్నీ చీల్చుకుంటూ... భూలోకాన్నీ బ్రద్దలు చేసుకుంటూ... ఉద్భవించిన "అగ్నిలింగము" రెప్పపాటులో అంతరిక్షమును అధిగమించి... అంతులేనంతగా వ్యాపితమై విస్తరించింది ఆ జ్వాలాస్థంభము... ఆ మరుక్షణమే... ఆ పాశుపతాస్త్రం - మహేశ్వరాస్త్రం చెరొక వైపునుంచి వచ్చి... ఆ "అగ్నిలింగము" నందు ఐక్యమైపొయాయి... ఆ మరుక్షణమే ఆ రెండు ధివ్యాస్త్రములనూ తనలొ లీనం చేసుకున్న ఆ అగ్నిలింగము వాటి మహా శక్తులతొ సమ్మిళతమై అపూర్వమైన "జ్యోతిర్లింగము" గా అవతరించింది...
👉 ఆ జ్యొతి స్థంభము నందు ప్రళయాగ్నిని మించిన ప్రచండ తేజంతొ ప్రజ్వరిల్లుతున్న వహ్నిప్రతాపం ముందు అగ్నిదేవుడు వెల వెలబోయాడు ఆ సమయాన... వేలాది ధివ్య శంకరాధ్వనులు ముల్లొకములు అంతటా వినిపుస్తుండగా... వేలాది ధివ్య డమరక నాథాలు పద్నాలుగు భువనాలలొ ప్రతిధ్వనిస్తుండగా... వేలాది ధివ్య ఘంటారావాలు త్రిలొక వాసులనూ భక్తి ప్రవత్తులను చేస్తూ ఉర్రూతలూగిస్తుండగా... అత్యద్భుతమైన ధివ్య కంఠస్వరాలు మధుర మాధుర్య గళ గానములతొ భక్తి పారవశ్య భావైక్య తత్పరతతొ... తన్మయతతొ... ఆర్ధ్రతతొ... హుంకరిస్తున్నాయి....
.....ఓం హర హర మహదేవా.....
No comments:
Post a Comment