ఆదిమూలమే మాకు అంగరక్ష
శ్రీదేవుడే మాకు జీవరక్ష॥
శ్రీదేవుడే మాకు జీవరక్ష॥
భూమిదేవి పతియైన పురుషోత్తముడే మాకు
భూమిపై నేడ నున్నా భూమిరక్ష
ఆమని జలధిశాయి అయిన దేవుడే మాకు
సామీప్య మందున్న జలరక్ష॥
భూమిపై నేడ నున్నా భూమిరక్ష
ఆమని జలధిశాయి అయిన దేవుడే మాకు
సామీప్య మందున్న జలరక్ష॥
మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తియైన దేవుడే
ఆయములు దాకకుండా అగ్నిరక్ష
వాయుసుతునేలినట్టి వనజనాభుడే మాకు
వాయువందుకందకుండా వాయురక్ష॥
ఆయములు దాకకుండా అగ్నిరక్ష
వాయుసుతునేలినట్టి వనజనాభుడే మాకు
వాయువందుకందకుండా వాయురక్ష॥
పాదమాకసమునకు పారజాచే విష్ణువే
గాదిలియై మాకు ఆకాశరక్ష
సాధించి శ్రీవేంకటాద్రి సర్వేశ్వరుడే మాకు
సాదరము మీరినట్టి సర్వరక్ష॥
గాదిలియై మాకు ఆకాశరక్ష
సాధించి శ్రీవేంకటాద్రి సర్వేశ్వరుడే మాకు
సాదరము మీరినట్టి సర్వరక్ష॥
No comments:
Post a Comment