2-178-మ.
మదిఁ గృష్ణుండు యశోదబిడ్డఁ డని నమ్మంజాల యోగీంద్ర త
ద్వదనాంభోజములోఁ జరాచర సమస్తప్రాణిజాతాటవీ
నద నద్యద్రి పయోధి యుక్త మగు నానా లోకజాలంబు భా
స్వ దనూనక్రియఁ జూపెఁ దల్లికి మహాశ్చర్యంబు వాటిల్లఁగన్.

టీకా:
మదిఁన్ = మనసులో; కృష్ణుండు = కృష్ణుడు; యశోద = యశోద యొక్క; బిడ్డఁడు = పిల్లాడు; అని = అని; నమ్మంజాల = నమ్మలేను; యోగి = యోగులలో; ఇంద్ర = శ్రేష్టుడా; తత్ = అతని; వదన = నోరు అను; అంభోజమున్ = పద్మము {అంభోజము - నీటిలో పుట్టినది - పద్మము}; లోన్ = లోపల; చర = కదులునవి; అచర = కదలలేనివి అయిన; సమస్త = సర్వ; ప్రాణి = జీవుల; జాత = జాతులను; అటవీ = అడవి; నద = నదములు {నదములు - పడమటికి ప్రవహించునవి}; నది = నదులు {నది - తూర్పునకు ప్రవహించునది}; అద్రి = కొండలు; పయోధిన్ = సముద్రములు; యుక్త = కలిగినది; అగు = అయినట్టి; నానా = అనేక; లోక = లోకముల; జాలంబున్ = సమూహములను; భాస్వత్ = ప్రకాశముతోను; అనూన = నిరాటంకమైన; క్రియఁన్ = విధముగాను; చూపెన్ = చూపించెను; తల్లి = తల్లి; కిన్ = కి; మహా = గొప్ప; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యము; పాటిల్లగన్ = కలుగునట్లు.

భావము:
యోగివరేణ్యుడ! నారద! ఇలాంటి పరమాద్భుతాలు ఎన్నో బాల్యంలోనే చేసిన కృష్ణుడు యశోద కొడకని నేను నమ్మలేకుండా ఉన్నానయ్యా. ఒకనాడు అతడు తల్లికి సకలచరాచర జీవులు, అడవులు, నదీనదాలు, పర్వతాలు, సముద్రాలు సమస్తంతో కూడిన వివిధ జగజ్జాలాలని అపూర్వంగా తన నోట చూపాడు. అది చూచి ఆ తల్లి అమితాశ్చర్యంతో చకితురా లయింది.

No comments:
Post a Comment