|| అమ్మ కోసం - తెలుగు గజల్ 99 ||
(అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలతో )
అమ్మ ఒడియే సర్వసుఖముల స్వర్గమేనని తెలుసుకో 
ఆమె కడనే ఎన్నొవిద్యల నిలయముందని తెలుసుకో
ఆమె కడనే ఎన్నొవిద్యల నిలయముందని తెలుసుకో
రక్తమాంసములిచ్చి మోసే దేవతేగా ధరణిలో
కన్నతల్లికి సేవ చేస్తే తరిస్తావని తెలుసుకో
కన్నతల్లికి సేవ చేస్తే తరిస్తావని తెలుసుకో
యముని సైతం లెక్కచేయక జన్మనిచ్చును బిడ్డకి
ఏమి చేసిన మాతృ ఋణమూ తీరబోదని తెలుసుకో
ఏమి చేసిన మాతృ ఋణమూ తీరబోదని తెలుసుకో
పసితనాన గోరుముద్దలు పెట్టి పెంచును ప్రేమతో
పట్టెడన్నం రోజు పెడితే ఆస్తి పోదని తెలుసుకో
పట్టెడన్నం రోజు పెడితే ఆస్తి పోదని తెలుసుకో
ఆలిమాటకు తలను ఊపుతు కీలుబొమ్మగ మారకూ
కడుపుచూసే తల్లి కాళ్ళను పట్టవలెనని తెలుసుకో.
( ఈ షేర్ అందరికీ వర్తించదు సుమా smile emoticon... )
కడుపుచూసే తల్లి కాళ్ళను పట్టవలెనని తెలుసుకో.
( ఈ షేర్ అందరికీ వర్తించదు సుమా smile emoticon... )
ముసలితనమే మీద పడితే చీదరించుట ఎందుకు
ఆశ్రమానికి పంపివేస్తే నరకమేనని తెలుసుకో
ఆశ్రమానికి పంపివేస్తే నరకమేనని తెలుసుకో
తల్లినింట్లో సరిగచూడక పాపరాశులు పెంచకూ
కాశికెళ్ళిన గంగమునిగిన ఫలములేదని తెలుసుకో. #శ్రీ
కాశికెళ్ళిన గంగమునిగిన ఫలములేదని తెలుసుకో. #శ్రీ

No comments:
Post a Comment