UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 16 May 2015

మనవడు పుట్టాక నాకో కొత్తపేరు పెట్టారు: బాలయ్య

నటుడిగా నలబై ఏళ్లు పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ.. ప్రజాప్రతినిధిగా ఫుల్‌ బిజీ అయిపోయారిప్పుడు. ఈ మధ్య ఇంట్లో కూడా ముద్దులొలికే మనవడితో తీరిక లేకుండా ఉన్నారు. ‘లయన్‌’ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న ఆయన ‘నవ్య’తో పలు విషయాలు మాట్లాడారు. మనవడి మీద బావ చంద్రబాబుతో ఎలాంటి జోకులు 
వేస్తుంటారు? ఇంట్లో వాళ్లు తనకు పెట్టిన కొత్త పేరు ఏమిటి? వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు? ఎమ్మెల్యేగా ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు? వంటివన్నీ ముచ్చటించారు బాలయ్య.. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
 
నాకు మనవడు పుట్టడం మళ్లీ నాన్న ఎన్టీఆర్‌గారు పుట్టినంత ఆనందంగా ఉంది. నాకిది పెద్ద ప్రమోషన్‌. పిల్లలు అంటే మన చిన్నతనాన్ని మనం రెండోసారి చూసుకుని మురిసిపోయే అద్భుతమైన అవకాశం అనిపిస్తుంది. నా కూతురు బ్రాహ్మణి- లోకే్‌షలకు మగబిడ్డ పుట్టిన తర్వాత బావ చంద్రబాబుగారు రోజు విడిచి రోజు మా ఇంటికొచ్చి.. మనవణ్ణి చూసి వెళుతున్నారు. మనవడి పుణ్యమాని మేమిద్దరం కాసేపైనా మాట్లాడుకునే అవకాశం దొరుకుతోంది. మనకు తెలియకుండానే మనుషుల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసే శక్తి పిల్లలకు ఉంది. బావగారు ఇంటికి వచ్చినప్పుడు నేనే సరదాగా ఆయనతో జోకులు వేస్తుంటాను. ఆయనైతే ఎప్పుడూ జోకులు వెయ్యరు కదా! ‘మనవడు ఇక్కడుండటమే మేలు బావగారు.. మీ ఇంటికి తీసుకెళితే.. వాణ్ణి మెల్లగా మీ రాజకీయాలవైపు తిప్పుకుంటారేమో’ అంటుంటాను. ఇంట్లో నా హడావిడిని చూస్తున్న మా అమ్మాయిలు ‘మీ గోల తాతయ్యా’ వచ్చాడంటూ మనవడి వద్ద చతుర్లు వేస్తుంటారు.
 
మరో రెండేళ్లకు మోక్షజ్ఞ ఎంట్రీ
2017లో మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్నాడు. ఇప్పటి వరకైతే అబ్బాయికి సంబంధించిన సినిమాకు ఎలాంటి ప్లాన్‌ చేయలేదు. ఏ తండ్రి అయినా కొడుకు పైకి రావాలని ఆశ పడతాడు. నేను కూడా అంతే! అంతకు మించి ఆలోచన లేదు. మా అబ్బాయి మొహమాటాలకు పోడు. ముక్కుసూటి మనిషి. ఏమున్నా ఓపెన్‌గా మాట్లాడేతత్వం. అందరితో కలవడు. చాలా పరిశీలించి, ఆలోచించి కానీ స్నేహం చేయడు. కొంతమంది శ్రేయోభిలాషులు అనుకున్న వాళ్లతోనే కలుస్తుంటాడు. పదికాలాలపాటు ఆర్టిస్టుగా నిలదొక్కుకోవాలంటే.. ఇవన్నీ ఉండాల్సిన క్వాలిటీసే అని అనుకుంటుంటాను. సినిమాల్లోకి రావడానికి మోక్షజ్ఞకు ప్రత్యేకమైన తర్ఫీదు అంటూ ఏమీ ఇవ్వడం లేదు. మా నాన్న నాకు ఇవ్వలేదు. నేను మా అబ్బాయికి ఇవ్వలేదు. నాన్నగారు నా సినిమాలను కూడా పెద్దగా చూసేవారు కారు. నటనకు సంబంధించిన సలహాలు కూడా ఏ రోజు ఇవ్వలేదాయన. పిల్లలు ఎవరి ప్రభావమూ లేకుండా స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఎదగాలన్నదే ఆయన ఆలోచన. నేను కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నాను. ఈ రోజుల్లో మనం పిల్లలకు చెప్పేదేముంది ? వాళ్లకు అన్నీ తెలుసు. జనరేషన్‌ మారుతోంది. నటనలోనూ ఎంతో మార్పు వచ్చింది. నాచురల్‌ యాక్టింగ్‌కు ప్రాధాన్యం పెరిగిందిప్పుడు. ‘మంగమ్మగారి మనవడు’, ‘భైరవద్వీపం’, ‘సమరసింహారెడ్డి’.. ‘సింహా’, ‘లెజెండ్‌’ ఇలా ఎన్నో వైవిధ్యమున్న పాత్రలను వేశాను. ఆ రోజులకు అది నచ్చింది. పోను పోను ఫ్యూచర్‌ ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పలేం. కాబట్టి.. నా కొడుకుకు నేను చెప్పడం లేదు. అన్నీ అతనే తెలుసుకుని, కష్టపడి పైకి రావాలన్నదే నా అభిలాష.
 
వందో చిత్రం అప్పుడు ఆలోచిస్తా 
నా మొదటి చిత్రం ‘తాతమ్మ కల’. అందులో నటిస్తున్నప్పుడు నాకు పద్నాలుగేళ్లు. ఆ సినిమా విడుదలై ఇప్పటికి నలభై ఏళ్లు అవుతోంది. మొన్న రిలీజైన ‘లయన్‌’తో తొంభై ఎనిమిది చిత్రాలు పూర్తయ్యాయి. తొంభై తొమ్మిదో చిత్రం చర్చల్లో ఉంది. ఇక వందో చిత్రం ఎప్పుడన్నది అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. దేని గురించైనా ముందుగానే అంచనాలు పెట్టుకునే అలవాటు నాకు లేదు. ప్రతిఫలం ఆశించకుండా మన ప్రయత్నం మనం చేయాలంతే! ముందు నుంచే అలా ఉండాలి ఇలా ఉండాలని ఆరాటపడను. ఏ చిత్రాన్ని అయినా వేడి వేడిగా వడ్డించడమే నాకు ఇష్టం. ఎన్నో మైలురాళ్లు దాటుకుని వచ్చాను. రకరకాల పాత్రలు చేశాను. ఎన్ని చేసినా నటునిగానే చేస్తూ పోతుంటాను తప్ప.. ముందే ప్రిపేర్‌ అవ్వడం ఉండదు. అయితే ‘లెజెండ్‌’ తీస్తున్నప్పుడు మాత్రం నేను, బోయపాటి శీను ఒకటి అనుకున్నాం - ‘ఈ సినిమా ఎలక్షన్లకు కాస్త ముందు రావాలి. అది పార్టీ విజయానికి ఉపకరించాలి..’ అని. ఎందుకంటే అది నాన్నగారు పెట్టిన పార్టీ. అందులోను పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం. కాబట్టి నటునిగా నావంతు కృషి చేయాలి కనక ‘లెజెండ్‌’ ద్వారా ఆ పని చేద్దాం అనుకున్నాను. ఆ సినిమా విడుదలయ్యాక పార్టీ కార్యకర్తల్లో కొంత వరకు ఊపు వచ్చింది. ఎన్నికల మీద దాని ప్రభావం ఉంది.
 
ఎమ్మెల్యేగా ఒక లక్ష్యం ఉంది
నేను ముందు నుంచి రాజకీయ కుటుంబంలో ఉన్న వ్యక్తినే. నేనెప్పుడూ జనంలోనే ఉంటున్నాను. అందుకే ఎమ్మెల్యే అయ్యాక కొత్తగా ఏమీ అనిపించలేదు. నేను హీరో అని చెప్పి అందరికీ దూరంగా ఉండలేదు. అందరితో కలుస్తూనే ఉన్నాను. అయితే ఎమ్మెల్యే అయ్యాక ఒక అధికారిక ప్రతినిధిగా ప్రజలతో కలిసే అవకాశం వచ్చింది. అదొక్కటే సంతోషం. అనంతపురం జిల్లాలోని మా హిందూపురం ప్రజలు చాలా సున్నిత మనస్కులు. వాళ్లకున్న పెద్ద సమస్య తాగునీరు. నీళ్లిస్తే చాలు అంటున్నారు. నేను ముఖ్యమంత్రిగారితో మాట్లాడుతున్నాను. ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను. అనంతపురం మీదున్న ప్రేమతోనే నాన్నగారు హంద్రీనీవాను కూడా ప్రారంభించారు అప్పట్లో. ఎమ్మెల్యేగా తాగునీరు, పరిశ్రమలు సమకూర్చాలన్నదే నా లక్ష్యం. స్థానికులకు ఉపాధి కల్పిస్తే చాలు.
 
క్యాన్సర్‌ ఆస్పత్రి నాకో సెంటిమెంట్‌
క్యాన్సర్‌ అనేది ఒక భయంకరమైన జబ్బు అన్న భయం ప్రజల్లో ఉంది. ఒక్కసారి జబ్బు వస్తే చనిపోయినట్లేనని భావించేవాళ్లు చాలా మందే ఉన్నారు. అంటే క్యాన్సర్‌ వ్యాధి కంటే ఆ జబ్బు ఉందన్న భయం మనుషుల్ని తినేస్తోంది. ఒక సెలబ్రిటీగా నేను ప్రజల్లోకి వెళ్లి క్యాన్సర్‌ వ్యాధి పట్ల చైతన్యం తీసుకురావాలని అనుకున్నాను. అది మా నాన్న ఆశయం కూడా. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి అనేది నాకో సెంటిమెంట్‌. అప్పట్లో మా అమ్మగారికి క్యాన్సర్‌ సోకినప్పుడు విదేశాలకు తీసుకెళ్లి వైద్యం చేయించారు నాన్న. డబ్బున్నవాళ్లు ఖరీదైన వైద్యం చేయించుకోగలరు. అదే సామాన్యులకు క్యాన్సర్‌ సోకితే ప్రాణాలు పోగొట్టుకోవలసిందేనా? అలా కాదు, అందరికీ వైద్యం అందుబాటులోకి రావాలన్న లక్ష్యంతో ఆస్పత్రిని స్థాపించారాయన. క్యాన్సర్‌ ఆస్పత్రిలో పిల్లల్ని చూసినప్పుడు నా మనసుకు బాధేస్తుంది. వాళ్ల దగ్గరికి వెళ్లి ఆత్మీయంగా పలకరించినప్పుడు.. వాళ్ల కళ్లలో మెదిలే ఆ ఆశ నన్ను ముందుకు నడిపిస్తోంది. క్యాన్సర్‌కు మంచి వైద్యం వచ్చింది. భయపడాల్సిన అవసరం లేదు. నేను ప్రచారం చేయడం వల్ల పేషెంట్లకు మనోధైర్యం వస్తోంది. ఈ మధ్యనే అనంతపురం జిల్లా రొద్దం దగ్గర బస్సు లోయలోకి పడిపోయినప్పుడు కూడా.. బాధితులను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లాను. నేను వెళ్లి నాలుగు ఊరడించే మాటలు చెప్పడం వల్ల.. వారిలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వచ్చింది. త్వరగా కోలుకున్నారు. నాకెంతో సంతృప్తి కలిగింది.
 
నాన్న నటనే నాకు కొలమానం..
చిన్నప్పుడు నాన్నగారి సినిమాలు తప్పితే ప్రపంచం తెలియదు. అప్పట్లో హైదరాబాద్‌లో మా థియేటర్‌ కన్‌స్ట్రక్షన్‌ జరుగుతుండేది. నిర్మాణానికి వాడే ఇనుప వస్తువులు, చిలుకులు చేతుల్లో పట్టుకుని.. నేను మా అన్నయ్య ఆడుకునేవాళ్లం. నేను రామారావుగారినని, ఆయన రాజనాల అని చిన్న చిన్న డైలాగులు చెప్పుకునేవాళ్లం. మా ఫ్యామిలీలో అంతమంది ఉంటే - నాకు, అన్నయ్యకు నటించే అవకాశం భగవంతుడు ఇచ్చిన వరం. నాకు ఎప్పటికీ నటనలో కొలమానం నాన్నే! ఆ రోజుల్లో ఆయనే ఓ ట్రెండు. కాలం వెంట ఆయన పరిగెత్తలేదు. కాలమే ఆయన వెంట పరిగెత్తింది. వాణిజ్యభావనతోనే ఆయన సినిమాలు తీయలేదు. సంఘానికి ఏదో ఒక నీతి చెప్పాలన్న దృక్పథంతోనే తీశారు. రోజూ నాన్నగారిని పలకరించేందుకు వచ్చే అభిమానులతో మా ఇల్లు తిరునాళ్లను తలపించేది. సినిమాల్లో ఉన్నప్పుడు ఆయనకు టైమ్‌ లేదు. నాన్న రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంచెం కలిసేవాణ్ణి. కెమెరా ముందు ఒక కొడుకుగా కాకుండా కేవలం నటునిగానే చూసేవారు. రామారావుగారి అబ్బాయి అని కాకుండా.. స్వయంకృషితో పైకి రావాలన్నది ఆయన ఆలోచన. ఆ ప్రభావంతోనే నేను పైకొచ్చాను..’’
 
‘లయన్‌’ కొత్త నేపథ్యంతో తీశాం
‘లయన్‌’ సినిమాను ఒక కొత్త నేపథ్యంతో తీశాము. దర్శకుడు అయిదేళ్ల నుంచి ఈ కథను పట్టుకుని నా వద్దకు వచ్చేవాడు. ఇందులో నేను వేసిన సీబీఐ పాత్రతో పాటు.. టెక్నాలజీ పాయింటు ఆధారంగా అల్లిన కథ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ ప్రయోగం ఎందుకు చేశామంటే ఇప్పుడు పల్లెల్లో ఎవరు చూసినా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లు వాడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం మీద అవగాహన ఉంది. కాబట్టే సినిమా కథను ఆ విధంగా మలిచాం. ఈ మధ్య కాలంలో సీబీఐ అధికారుల గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అందుకే ఆ అధికారి పాత్రను వేశాను. పాటలు జనరంజకంగా, ఫైట్లు ఆసక్తికరంగా తీర్చిదిద్దారు దర్శకులు. ఒక భిన్నమైన సినిమాలో మంచి పాత్ర వేశానన్న సంతృప్తి నాకు దక్కింది.
 
బాలయ్య డైలీ డైరీ..
ఉదయం 3.30 గంటలకే నిద్రలేవడంతో నా రోజు మొదలవుతుంది. 4.20 గంటలకు జిమ్‌కు వెళతాను. జిమ్‌లో నేను ఎక్కువగా కార్డియో ఎక్సర్‌సైజ్‌ చేస్తుంటా. డైలాగులు శక్తివంతంగా చెప్పాలన్నా, ఫైట్లు, డ్యాన్సులు బాగా చేయాలన్నా.. లంగ్‌ కెపాసిటీ ఎక్కువ ఉండాలి. ఒక్కోసారి ఊపిరి తీసుకోకుండా ఒకే బ్రీత్‌తో భారీ డైలాగును చెప్పాల్సి వస్తుంది. రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌ వల్లే నేను సులువుగా నాన్‌స్టాప్‌ డైలాగులు చెప్పగలుగుతున్నాను.
 
జిమ్‌ నుంచి ఇంటికి తిరిగొచ్చాక.. 5.45 గంటలకు సుమారు గంటన్నర పాటు పూజలు చేస్తాను. మనం ఎన్ని పనులు చేసినా మన కోసం మనం కేటాయించుకునే సమయం ఒకటి ఉంటుంది. నాకు అది పూజాసమయం. ఉదయాన్నే అందరూ నిద్రలేచే సమయానికి భక్తితో లక్ష్మీనరసింహస్వామిని పూజించడం అలవాటు. ఆయన రౌద్రానికి ప్రతీక. అందుకేనేమో నాకు ఆ స్వామి మీద భక్తి ఏర్పడింది. సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి, దుర్గామాతలను కూడా పూజిస్తుంటాను. నాకు చిన్నప్పటి నుంచి భక్తి లేదు. పదిహేనవ ఏట నుంచి ఆధ్యాత్మిక చింతన అలవడింది. దేవున్ని ఆశించి నేను పూజ చేయను. నా పూజకు ఒక ఫిలాసఫీ ఉంది.
 
ఆహారం విషయానికి వస్తే.. ఫలానా ఫుడ్‌ అని నిబంధనలు ఏమీ లేవు. సినిమాల్లో పాత్రలను బట్టి డైట్‌ మెయింటెన్‌ చేస్తాను. రాత్రిపూట భోజనం చేయను. ఆ పూట నాన్‌వెజ్‌ ముట్టను. చాలా తేలికైన ఆహారం తీసుకుంటాను. 
 

No comments:

Post a Comment