ఆశకి , కోరిక కి అంతే లేదా.? అసలర్దమైనా ఉందా.? ఒకటి కావాలని కోరుకోవచ్చు, ప్రయత్నించనూ వచ్చు .దానివల్లే కదా ఇంతింత గొప్ప ఆవిష్కరణలు జరిగాయి.కానీ కోరుకున్నవి దొరికాక వాటి విలువ, వాటి వల్ల వచ్చే ఆనందం, యితరుల గుర్తింపు మీదే ఆదారపడి ఉంటే ఎలా? పొందిన దాన్ని , పట్టుమని పది నిమిషాలు ఆగి, ఆనందించే వ్యవది, అవసరం లేని వాటి కోసం ఏళ్ళకి ఏళ్ళు కష్టపడతాం.దాన్ని పది మంది గుర్తిస్తేనే ఆ ఆనందపడ్డం , నీకు నువ్వుగా ఏకాంతంగా ఆనందించలేని దాన్ని పొందడానికి అన్నేళ్ళు ప్రయత్నించడమంటే, ఎవడికో అన్నేళ్ళు చాకిరీ చెయ్యడమే..!
దేన్నైనా వాటివిలవని ఎలా గుర్తిస్తాం.!
ఒకడికి సైకిలుంటే చాలు.మరొకడికి సైకిలంటే నామోషీ.!
బైక్ కోసం కలలు కంటాడొకడు.బైక్ మీద వీదుల్లో తిరగడం పీడకల మరొకడికి.!
రూపాయి రూపాయి దాచి కారు కొంటామా.?అలాంటి చిన్న చిన్న కారుల్లో తిరిగే వాడికి పిల్లనివ్వడు మరొకడు.!
ఒకడి కంపెనీలు అదిపతా.! వీడి కంపెనీలని చూసి మరొక బడా పారిశ్రామికవేత్త నవ్వుకుంటాడు.!వీడిలా విమానాల్లో తిరగడానికి వీలుకాక సొంత విమానాలు కొనుక్కుంటాడు వీడి పై వాడు.!దేశాదినేతలతోనూ చుట్టరికాలసు చిన్నతనమనుకునే రాజరికవంశాలున్నాయి..!వీటన్నిటి మద్యలో నేను నిర్మించుకున్న నా లక్ష్యం నిజంగా నాదేనా.? ఈ పోటీ పరుగుల రొదలో ప్రేరేపించబడ్డానా?

ఏది తిన్నగా నా హృదయాన్ని తాకి .,నన్ను మరింత శక్తి వంతం చేస్తుందో., నిరాదారంగా నా జీవితాన్ని సుసంపన్నం చేస్తుందో ,అదే నా లోపల" నేను " కోరుకుంటున్న కోరిక.!
అది తెలుసుకునే ప్రయత్నంలో.....నేను160515

No comments:
Post a Comment