హైదరాబాద్‌లో గూగుల్ 1000 కోట్ల పెట్టుబడి.. కెటిఆర్ వెల్లడి..
హైదరాబాద్‌లో గూగుల్ సంస్థ వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడానికి అంగీకరించిందని తెలంగాణ రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్ వెల్లడించారు. శాన్ ఫ్రాన్సిస్కో లో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రంజన్, గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రాడ్ క్లిఫ్‌లు ... కెటిఆర్ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న గూగుల్ సిబ్బంది రానున్న నాలుగేళ్ళలో 6500 నుంచి 13 వేలకు పెరగనుంది. హైదరాబాద్ లో గూగుల్ సంస్థ భారీ క్యాంపస్ ను ఏర్పాటు చేయనుందని కెటిఆర్ వెల్లడించారు.






No comments:
Post a Comment