దేహమేరా దేవాలయం
----------------------
మానవతే కరువైన చోట
మమతలన్ని నేలరాలుతున్న వేళ
మంచిలేదు
మనిషి లేడు
అంతులేని మోహాలకు విలువిస్తాడు
మానవత్వాన్ని వెలివేస్తాడు
సాటి మనిషిని కూలదోస్తాడు
తన విజయానికి పొంగిపోతూ
----------------------
మానవతే కరువైన చోట
మమతలన్ని నేలరాలుతున్న వేళ
మంచిలేదు
మనిషి లేడు
అంతులేని మోహాలకు విలువిస్తాడు
మానవత్వాన్ని వెలివేస్తాడు
సాటి మనిషిని కూలదోస్తాడు
తన విజయానికి పొంగిపోతూ
కూడు, గుడ్డను మించిన మర్మమేదో వెంటాడుతూ మాయచేస్తుంటే ఏదో కూడబెట్టాలని
మరేదో వారసత్వానికి దోచి పెట్టాలని
రక్త బంధాలకిలొంగిపోతూ
సాటి మనుషులను ..
స్వలాభాలకు వాడుకుంటాడు..
అసత్యాలతో అందరినీ అల్లుకుంటూ నిబద్దతలేని జీవితాన్ని గడిపేస్తాడు
మరేదో వారసత్వానికి దోచి పెట్టాలని
రక్త బంధాలకిలొంగిపోతూ
సాటి మనుషులను ..
స్వలాభాలకు వాడుకుంటాడు..
అసత్యాలతో అందరినీ అల్లుకుంటూ నిబద్దతలేని జీవితాన్ని గడిపేస్తాడు
పైదవి నవ్వులతో మోసగిస్తాడు
మనసుతో నవ్వడమే మరచిపోతాడు
కులమతాల నడుమ
మది కుళ్ళబెట్టుకుంటాడు ..
మనసుతో నవ్వడమే మరచిపోతాడు
కులమతాల నడుమ
మది కుళ్ళబెట్టుకుంటాడు ..
వావి వరుసలు మరచి
నైతిక విలువలను తార్చి
వలువలొలుచుకుని వీధిలోనైనా నిలబడతాడు
నీతికి మాత్రం తలవంచనంటాడు
ఇదే ఇదే వర్తమానం లో
మా మానవ నైజమంటాడు
నైతిక విలువలను తార్చి
వలువలొలుచుకుని వీధిలోనైనా నిలబడతాడు
నీతికి మాత్రం తలవంచనంటాడు
ఇదే ఇదే వర్తమానం లో
మా మానవ నైజమంటాడు
విజ్ఞానాన్ని ఉసురు తీసి
పలు వికారాలకు నాంది పలుకుతూ
రాచరికపు మార్గాలకు బాటను వెయ్యాలని..
అసలు మార్గాన్నే మరచిపోతాడు
మనిషి తనాన్ని గాలికొదిలేస్తాడు
చేసిన తప్పుల కప్పి పుచ్చుకుంటూ
ఎదుటి మనిషిపై నిందలేస్తాడు..
పలు వికారాలకు నాంది పలుకుతూ
రాచరికపు మార్గాలకు బాటను వెయ్యాలని..
అసలు మార్గాన్నే మరచిపోతాడు
మనిషి తనాన్ని గాలికొదిలేస్తాడు
చేసిన తప్పుల కప్పి పుచ్చుకుంటూ
ఎదుటి మనిషిపై నిందలేస్తాడు..
సాటి మనిషికి సాయపడని మనిషితనమెందుకో
పరాయి కులపోడని వెలివేసే అవిటితనమెందుకో
మనిషిననే గర్వాన్ని
మానవత్వపు ముసుగులో
దేహమంతా కప్పుకుంటాడు..
పరాయి కులపోడని వెలివేసే అవిటితనమెందుకో
మనిషిననే గర్వాన్ని
మానవత్వపు ముసుగులో
దేహమంతా కప్పుకుంటాడు..
No comments:
Post a Comment