Narendra Naidu
మా గుండెలో బతికే ఉన్నాడు అని కొన్ని లక్షల మంది ఇప్పటికి అంటున్నారు.
అతను వ్యక్తి కాదు ఒక మహాశక్తీ.
అతనే పేద ప్రజల ముద్దుబిడ్డ బెజవాడ బెబ్బులి "వంగవీటి మోహనరంగా"
రంగా గారు జనం మనిషి, తన జీవితం జనానికే అంకితం చేసారు.
ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కి బాగా తెలిసిన ఒక నటుడు రాజకియపార్టీ స్థాపించి తన మీటింగ్లకు జనాలని తండోపతండాలుగా రప్పించాడు కానీ రంగా గారు నటుడు కాదు కానీ కేవలం తన నోటి మాట ద్వారా ఒక జాతినే లక్షల సంఖ్య లో రప్పించిన ఘనత ఆయనకే చెల్లింది.
మరి ఆ రోజుల్లో ఇప్పటిలా ఎలక్ట్రానిక్ మీడియా లేదు, సెల్ ఫోన్స్ లేక పోయిన తన పిలుపు జాతికి మేలుకొలుపు కావాలి అని రప్పించాడు.
ఆ జాతి "కాపు" జాతి
రంగన్నా కాపులంతా ఏకం కావాలి అన్న నీ ఆశయం నీ చావుతో మరుగున పడింది, ఇప్పటికి నీ పేరు చెప్పుకొన్ని కొన్ని స్వార్ధపరులు పబ్బం గడుపుకుంటున్నారు కానీ నిజమైన మాలాంటి అభిమానులు నిన్ను గుండెలో పెట్టుకొని పూజిస్తున్నారు
పేద ప్రజలకి ఆధా"రంగా"
దోపిడీ దారుల గుండెలు బెద"రంగా"
జనం కోసం ఆస్తమించిన ఓ సూర్యుడా
మరల నువ్వు పుడతావని
ఆశిస్తూ
నీ సోదరుడు
డిసెంబర్ 26 రంగా గారి వర్దంతి సందర్భంగా ఇవే మా నివాళులు
జోహార్ రంగన్న

No comments:
Post a Comment