Nani Tammina
** సారీ .. రంగనాథ్ .. ఈ ముగింపు బాగోలేదు ..!! **
300 సినిమాల సుదీర్ఘ ప్రయాణం ..
అయినా, అంటని సినీ గోరోజనం !
స్వరంలో స్పష్టత .. అభినయాన ఇష్టత ..
కలబోస్తే _ రంగనాథ్ .. రంగనాథ్ .. !!
ఎంత ధైర్యంగా వినిపిస్తుందో నీ వాచకం ..
ఎంత ఠీవీగా కనిపిస్తుందో నీ రూపం ..
ఉన్నది రంగుల ప్రపంచంలో అయినా
వీడలేదు కదా సాహిత్య సహవాసం !!!
మరి ఏమైంది రంగనాథ్ .. ఏమైంది ?
చాలా ఉంది కదా ప్రపంచం.. అనేక వ్యాపకాల నవ్వుల పొట్లం ...
తరిమికొట్టలేనంత పెద్దది అయిపోయిందా ఒంటరితనం ?
అసలే గుర్తుకురాలేదా, "పోతే పోనీ" అన్న శ్రీశ్రీ కవిత్వం !!
***
నిజమే ...
మనసుకు చాలా కష్టమే కలిగి ఉంటుంది !
చుట్టూ శూన్యమే ఆవరించి ఉంటుంది ...
ఒక్కన్నే అన్న భావన నలిబిలి చేసే ఉంటుంది !!
"మరణమంటే శాశ్వత నిద్ర" అన్న నీ ఫిలాసఫీ
చావుని చిన్నదిగానే భావించి ఉంటుంది !!
అయినా సరే .. రంగనాథ్ ..
అసలేం బాగోలేదు ఈ తుది ఘట్టం !
నైరాశ్యం కాదు కదా జీవిత సందేశం !!
***
ఏదేమైనా అనుకో, రంగనాథ్ ...
అసలేం నచ్చలేదు నీ అర్ధంతర ముగింపు ..
సారీ ... నచ్చనే నచ్చలేదు నీ చివరి వాక్యం !!!
బట్, వుయ్ మిస్ యూ రంగనాథ్ జీ, మిస్ యూ !!
(నిన్న ఆత్మహత్యతో జీవిత ప్రస్థానాన్ని ముగించుకున్న
ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ స్మృతికి మనసారా అంజలి ఘటిస్తూ ...నాని

No comments:
Post a Comment