మేము తరియించినామయ్యా
పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ
పరమాత్ముడున్నాడనీ
వాడు పరిశుద్దుడవుతాడనీ
గోళీల ఆటల్లో కొండంత సత్యం
చాటావు ఓ సాయి మమ్ము సాకావు మా సాయి
వాసనలు వేరైనా వర్ణాలు ఎన్నైనా
పూలన్నీ ఒకటంటివి
నిన్ను పూజించ తగునంటివి
మా తడి లేని హృదయాల
దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి
మాలో కలతల్ని మాపేస్తివి
పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం
మిగిలేది ఈ పుణ్యం
ఇచ్చి మేలైన పై జన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాదుల్ని మాపి
మరు జన్మ ఇచ్చావయ్యా
వారి బాధల్ని మోసావయ్యా
ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో
నువ్వెంత వాడైతివో
నువ్వు ఏనాటి దైవానివో
ఈ ద్వారకా మాయి నివాసమాయే
ధన్యులమైనామయా
మాకు దైవమై వెలిసావయా

No comments:
Post a Comment