లక్ష్మీ సరస్వతి పుష్పేషు లక్ష్మీ
ర్వ సతి పుష్కరే
పుష్పాంజతా నతోద్దోషః
బిల్వ పత్ర మథోముఖం
పుష్పాలలో లక్ష్మీ దేవి నివసిస్తుంది. అనుదువల్ల భగవంతునికి అర్పించేటప్పుడు పువ్వులు క్రింద ముఖభాగంగా ఉండకుండా చుడాలి. కాని పుష్పాంజలి సమర్పించేటప్పుడు ఈ విషియానికి అంత ప్రాధాన్యత ఇవ్వబడలేదు. ఉదాహరణకు తులసి దళాలకు,బిల్వపత్రాలకు ఈ విధానం వర్తించదు. ఏ విధంగానైనా అవి సమర్పించుకోవచ్చు. నియమానుసారముగా పుష్పాలు లభించకపోతే శ్రీ హరి పూజకు మాత్రం తులసి దళాలు వాడుటం ఉత్తమం అని వృద్ధ గౌతమ స్మృతి చెబుతోంది.పరమేశ్వరునికి పసుపురంగు దేవకాంచనం, అమ్మవారికి మల్లి ,మందారం,చంపక,కుంద,కేసర ,శీరీష పుష్పాలంటే ఇష్టమని చెప్పబడింది. అమ్మవారు ఈ పుష్పాలనే తన శిరోజాలలో అలంకరించుకుంటారు. అలాగే ఆ తల్లి కదంబ వనాలలో సంచరిస్తూ ఉంటుంది...అమ్మ కి కదంబ పువ్వులు అంటే మహా ప్రీతి !
మరోక్క ముఖ్యమైన విషియం ఎంటీ అంటే పొద్దున్న పూట స్నానాలు చెయ్యకుండ బయట నడుస్తూ అలా దారి వెంబట ఇళ్ళ పక్కన కనిపించిన పువ్వులు కోసుకుని వచ్చి ఇంటిలో దేవుడికి సమర్పిస్తే అవి పనికి రావు. దాని బదులు మనం ఇంట్లో పెంచిన కెవలం ఒక పువ్వు ను మనస్ఫూర్తిగా సమర్పించుకొవటం ఎంతో మంచిది.
No comments:
Post a Comment