UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 13 June 2016

క్లబ్‌లో కాల్చింది ఒకడు కాదా? 
14-06-2016 02:15:17



  • రెండు పక్కల నుంచి శబ్బం వినిపించింది
  • ఇది ఒక ప్రత్యక్ష సాక్షి కథనం
  • మృతుల శరీరాల్లో తూటాల కుప్పలు
  • అన్ని బుల్లెట్‌లు ఒక్కడే ఎలా తీసుకెళ్లాడు?
  • ఇంత నరమేధం ఒక్కడితో కాదన్న నిపుణులు
  • ఓర్లాండో నరహంతకులు ఎందరు?
  • అమెరికా, ఓర్లాండోలో అలముకున్న నిర్వేదం
  • మృతులు 49 మంది.. హంతకుడు సహా 50

ఓర్లాండో, జూన్‌ 13: ఓర్లాండో స్వలింగ సంపర్కుల క్లబ్‌లో కాల్పుల ఘటన ఒమర్‌ మటీన్‌ ఒక్కడి పనే కాదా? మరో నరహంతకుడు కూడా ఉన్నాడా? ఆయుధ నిపుణులు కొందరు ఈ సందేహాలనే వ్యక్తం చేస్తున్నారు. మృతుల సంఖ్య, గాయపడినవారి సంఖ్య చూస్తే.. ఇంతటి నరమేధం ఒక్కడివల్ల సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. వారు చెబుతున్నదాని ప్రకారం.. ఎంత ఏఆర్‌-15 రైఫిల్‌ వాడినా మనిషిని చంపడం అంత సులభం కాదు. మరీ నేరుగా ఏ గుండెకో ఆయువుపట్టుకో తగిలితే తప్ప.. సినిమాల్లో జరిగినట్టు ఒక్క తూటాతో మనుషులు చచ్చిపోరు. అందుకు చాలా బుల్లెట్లు అవసరమవుతాయి. ఈ లెక్క తేలాలంటే.. అసలు మొత్తం ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయో లెక్క తేలాల్సి ఉందని వారు అంటున్నారు. చనిపోయినవారి శరీరంలో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయి? గాయపడినవారి ఒంట్లో ఎన్ని దూరాయి? క్లబ్‌లో గోడల్లో, ఫర్నిచర్‌లో, సీలింగ్‌లో ఇరుక్కుపోయినవి ఎన్ని? ..ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తేనే అనేక చిక్కుముడులు వీడుతాయని వారు అంటున్నారు.
 
చిన్న లెక్క.. 
మటీన్‌ దగ్గర ఏఆర్‌ రైఫిల్‌లో ఒక మ్యాగజైన్‌, దాంతోపాటు మరో 8 ఫుల్లీ లోడెడ్‌ 30 రౌండ్ల మ్యాగజైన్లు ఉన్నాయనుకుంటే మొత్తం అతడి వద్ద ఉన్నవి 270 రౌండ్ల తూటాలు. దీంతోపాటు అతడి దగ్గర ఒక హ్యాండ్‌ గన్‌ కూడా ఉంది. అందులో 15 రౌండ్ల మ్యాగజైన్‌ ఉంది. ఇంకా అదనంగా ఎన్ని మ్యాగజైన్లు ఉన్నాయో తెలియదు. లెక్క కోసం మరో 4 మ్యాగజైన్లు ఉన్నాయనుకుంటే మొత్తం.. 75 తూటాలు. మొత్తం కలిపి 345 తూటాలు. ‘‘దాదాపు 100 మంది బాధితులు (49 మంది మృతులు-53 మంది గాయపడ్డవారు)- 345 తూటాలు అంటే లెక్క సరిగానే ఉందనిపించవచ్చుగానీ.. సైనికులను అడిగితే ఆ తూటాలు అంత మందిని చంపడానికి సరిపోవనే వారు అంటారు. 50 మందిని చంపాలంటే 1150 రౌండ్లు కావాలని చెబుతారు’’ అని ఆయుధ నిపుణులు అంటున్నారు. అందునా తొలి 9 సెకన్లలోనే అతడు 24 తూటాలు పేల్చేశాడు. తర్వాత 3 గంటలపాటు అతడు ఒక్కడే అంతమందిని బందీలుగా ఎలా ఉంచుకోగలిగాడని వారు ప్రశ్నిస్తున్నారు. నిజంగా అతడు అన్ని తూటాలే తీసుకెళ్తే వాటన్నిటినీ ఎలా మోయగలిగాడు? మోస్తూ అంతమందిని చంపడం ఎలా సాధ్యం? అన్నవి వారు వ్యక్తం చేస్తున్న మరికొన్ని సందేహాలు. ప్రత్యక్షసాక్షుల్లో ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. హంతకుడు ఎవరినో పిలిచాడని, అతడు నాలుగో షూటర్‌ అని చెప్పాడని తెలిపారు. ఆ ఇంటర్వ్యూ తాలూకూ వీడియో ఆధారాన్ని కూడా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. రెండు వైపుల నుంచి కాల్పుల శబ్దాలు వినిపించినట్టు మరో ప్రత్యక్ష సాక్షి తెలిపిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

No comments:

Post a Comment