అన్యకథానులాపము లహర్నిశముం బఠియించి చాల మా
లిన్యము నాత్మశోభన విలీనత నొందు మదీయ జిహ్వ సౌ
జన్యముతోడఁ గ్రోలు హరి సద్గుణ దివ్యకథామృతంబు స
న్మాన్యచరిత్రమై నెగడు మద్గురువాక్యపదంబుఁ జెందఁగన్.

టీకా:
అన్య = ఇతర; కథ = కథలను; అనులాపములు = వల్లెవేస్తూ; అహర్ = పగళ్ళు; నిశమున్ = రాత్రిళ్ళు; పఠియించి = చదివి; చాల = అధికమైన; మాలిన్యమున్ = కల్మషములతో; ఆత్మ = ఆత్మ; శోభన = శోభ; విలీనత = మరుగునపడుట; ఒందున్ = పొందును; మదీయ = నా; జిహ్వా = మాటలలోని; సౌజన్యము = మంచితనము; తోడన్ = తో; గ్రోలు = తాగు; హరి = విష్ణుని {హరి - సర్వ మలినములు హరించువాడు, విష్ణువు}; సత్ = మంచి; గుణ = గుణముల; దివ్య = దివ్యమైన; కథా = కథలు అను; అమృతంబు = అమృతము; సత్ = మంచివారిచే; మాన్య = కీర్తింపతగు; చరిత్రము = కథలు; ఐ = అయ్యి; నెగడు = అతిశయించు; మత్ = మా; గురు = గురువు {గురువు - ఈ సందర్భములో ప్రస్తుత వక్త మైత్రేయుని గురువు వేదవ్యాసుని తండ్రి పరాశరమహర్షి}; వాక్య = మాటల; పదంబున్ = మార్గమును; చెందగన్ = చెందునట్లు.

భావము:
ఈ నా నాలుక ఇతర కథాకలాపాలను రాత్రింబవళ్లు చదివి చదివి, చాలా మలినమై, ఆత్మ సౌందర్యాన్ని పోగొట్టుకొన్నది. నేడు నా గురుదేవునిచే నిర్దేశింపబడిన మార్గాన్ని అవలంబించి విష్ణుదేవుని సద్గుణవంతమైన సత్కథా గానం అనే అమృతాన్ని పానం చేసి సౌజన్యాన్నీ, సౌభాగ్యాన్నీ సంతరించుకున్నది.

No comments:
Post a Comment