ABN అనంతపురం, ఆగస్టు 17 : అనంతపురం జిల్లాను కరువు రక్కసి కబలిస్తోంది వర్షాలు లేక, ఉపాధి దొరక్కా గ్రామాలకు గ్రామాలే వలస వెళ్లిపోతున్నాయి. కొన్ని పల్లెల్లో వృద్ధులు మాత్రమే కనిపిస్తున్నారు. పశువులకు గడ్డి కూడా దొరకని పరిస్థితి. అనంతపురం జిల్లా భవిష్యత్ అంతుచిక్కడం లేదు. కరువు, ఏటా తగ్గిపోతున్న వర్షపాతం, పాతాళానికి పడిపోతున్న భూగర్భజలాలు... వెరసి జిల్లా పరిస్థితి వేగంగా తారుమారు అవుతోంది. ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. జల్లా సాధారణ వర్షపాతం 552.3 మి.మీటర్లు కాగా గత ఐదేళ్లుగా లోటు వర్షపాతం నమోదు అవుతుంది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 143.8 మి.మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 94.3 మి.మీటర్లు మాత్రమే కురిసింది. అది కూడా జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలే.. జులై నెలలో వాన జాడ లేదు.
జిల్లాలోని 63 మండలాల్లో పరిస్థితి చూస్తే ఒక్క శెట్టూరు మండలంలోనే సాధారణం కంటే ఎక్కువ వర్ష పాతం నమోదు అయింది. మిగిలిన 62 మండలాలు కరువు బారిన పడ్డాయి. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 8.65 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 3.04లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనం వేశారు. గత ఏడాది ఆగస్టు మొదటి వారానికి అన్ని పంటలు కలిపి 5.67 శాతం సాగు చేస్తే... ఈ ఏడాది కేవలం 33.84 శాతం మాత్రమే సాగులోకి రావడం కరువు తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో గ్రామాలకు గ్రామాలే ఖాళీ చేస్తూ చెన్నై, బెంగుళూరు వలస వెళ్లిపోతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే కొందరి మంత్రుల వ్యాఖ్యలు జిల్లా వాసులను ఎక్కిరించేలా ఉన్నాయి.
**************************N************
ఇటీవల ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప జిల్లా పర్యటను వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో జనం బతుకుతెరువు కోసం వలస వెళ్లడం లేదని, భోగభాగ్యాలు అనుభవించడానికే వెళుతున్నారని అన్నారు.
***************************N*************
ఇటీవల ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప జిల్లా పర్యటను వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో జనం బతుకుతెరువు కోసం వలస వెళ్లడం లేదని, భోగభాగ్యాలు అనుభవించడానికే వెళుతున్నారని అన్నారు.
***************************N*************
ఆయన వ్యాఖ్యలపై జిల్లా వాసులు మండిపడుతున్నారు. ఇక్కడ పర్యటించిన కేంద్రం బృందం కూడా కరువు పరిస్థితి చూసి ఆశ్చర్యపోయింది.
Source :
అనంతపురం, ఆగస్టు 17 : అనంతపురం జిల్లాను కరువు రక్కసి కబలిస్తోంది వర్షాలు లేక, ఉపాధి దొరక్కా...
No comments:
Post a Comment