Good Morning
ఎన్టీఆర్ బాల్యమంతా వారి పెద్దమ్మ, పెదనాన్నగార్ల దగ్గరే గడిచింది. ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు కన్న తల్లిదండ్రుల వద్ద పెరుగగా, ఎన్టీఆర్ మాత్రం పెద్దమ్మ పెంపకంలో పెరిగారు. తారకరామారావు అన్నపేరు పెదతండ్రి రామయ్య పెట్టినదే. ఎన్టీఆర్ తల్లి వెంకట్రామమ్మ తన కొడుకుకు కృష్ణుడి పేరు పెడదామని అనుకున్నారట. తీరా బావగారి మాట కాదనలేక రాముడి పేరుకు తలూపారట. ఆ కాలంలో ఇంట్లో పెద్దల మాటకు అంత విలువనిచ్చేవారు. అయితేనేం ఎన్టీఆర్ కు కృష్ణుడి మాదిరిగానే ఇద్దరు తల్లులు. ఒకరు కన్నతల్లి అయితే మరొకరు పెంచిన పెద్దమ్మ చంద్రమ్మ. కృష్ణుడి పేరు పెట్టుకోక పోతేనేమి. తల్లి ఆకాంక్ష ఫలించేట్టుగా కలియుగ కృష్ణావతారుడై ఆబాలగోపాలాన్ని అలరించారు ఎన్టీఆర్.
No comments:
Post a Comment