ముఖ్య మంత్రి పీఠంపై కూర్చోవాలని ఆశపడిన జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ కు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ప్రమాణ స్వీకారానికి గవర్నర్ పిలవాలని కోరుతున్న ఆమెకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో ఆమె సీఎం పీఠంపై కూర్చోవాలని ఆశ అట్టర్ ప్లాప్ అయ్యింది. జయలలిత 1991-96 మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆదాయానికి మించి రూ. 66 కోట్లకు పైగా ఆస్తులు సమీకరించుకున్నారనేది అసలు కేసు.
ఇందులో జయలలితతో పాటు.. ఆమె స్నేహితురాలు శశికళ, ఆమె బందువులు ఇళవరశి, వి.ఎన్.సుధాకరన్‌లు కూడా నిందితులుగా ఉన్నారు. అది రుజువు కావడంతో ఆమె పై సుప్రీంకోర్టు తీర్పును తెలిపింది. అయితే ఇదే విషయం పై ప్రముఖ టివీ చానెల్ అయిన టివీ 9 లో శశికళపై ఓ డిస్కర్షన్ నడిచింది. అయితే ఈ డిస్కర్షన్ లో మధ్యలో టివీ 9 యాంకర్ అయిన రజనీకాంత్ అనరాని మాట అనేసాడు. అది కూడా సుప్రీంకోర్టుని. సుప్రీంకోర్టుని అవమానించే రెంజ్ లో ఈ మాట అనడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద టాపిక్ అయ్యింది.
ఇంతకి రజనీకాంత్ ఏమన్నారంటే.. శశికళ పై ఇచ్చే తీర్పు సుప్రీంకోర్టు మూడ్ ని బట్టి ఉంటుందని అన్నారు. సుప్రీంకోర్టు ఏదైనా తీర్పు ఇవ్వాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి.. వాటి గురించి అన్ని విషయాలు తెలుసుకొని ఓ బలమైన తీర్పు ని ఇస్తోంది. అలాంటి సుప్రీంకోర్టుని రజనీకాంత్ అవమానించారు. సుప్రీంకోర్టు పై అలా నోరు జారడం ఏంతవరకు కరెక్ట్ అని అంటున్నారు. అలాగే మరి కొందరు సుప్రీంకోర్టు తీర్పు మూడ్ మీద ఆధారపడి ఉంటుందా..? అని సోషల్ మీడియా వేదిక గా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ టాపిక్ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.





No comments:
Post a Comment