19 స్టేలు.. ఎంత శిక్ష పడుతుంది బాబయ్యా!
తెలుగుదేశం పార్టీకి ఇది అలవాటే.. ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా, దానికీ జగన్ కు ముడిపెడుతూ మాట్లాడటాన్ని బాగా ఒంటపట్టించుకుంది పచ్చదళం. తెలుగుదేశం అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ నేతలు ఈ తరహా మాటలు మాట్లాడుతూ కామెడీ చేస్తున్నారు. ఈ కామెడీ ట్రూప్ అధినేత చంద్రబాబు నాయుడు శశికళ కు శిక్ష పడటాన్ని జగన్ కు ముడిపెట్టి మాట్లాడాడు! 56 కోట్ల అవినీతికి నాలుగేళ్ల శిక్ష అంటే.. లక్ష కోట్లకు ఎన్నేళ్లు? అంటూ బాబుగారికి సందేహం వ్యక్తం చేశారు!

అయితే.. ఇది సోషల్ మీడియా యుగం. జనాలు కూడా బాబుగారి విషయంలో గట్టిగా స్పందిస్తున్నారు. జగన్ విషయంలో బాబు పరోక్ష వ్యాఖ్యానాలకు పవర్ పంచ్ లు పడుతున్నాయి. మరి 56 కోట్ల రూపాయల అవినీతికి నాలుగేళ్ల జైలు శిక్ష పడింది కదా.. 19 కేసుల్లో స్టేలు రద్దు అయితే, వాటిపై విచారణలు మొదలై బాబుగారి అవినీతి గిరి పై తీర్పులొస్తే.. ఎంత శిక్ష పడుతుంది? అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి!
ఏలేరు స్కామ్ తో మొదలుపెడితే.. తెలంగాణలో ఎమ్మెల్యేను కొనబోయిన వ్యవహారం వరకూ ఒకటిన్నర డజనుకపై గా కేసుల్లో స్టేలతో బతుకీడుస్తున్నాడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. న్యాయస్థానాల వద్ద తనకున్న పట్టును ఈ విధంగా ఉపయోగించుకుని.. ‘నిప్పు’ ని అని చెప్పుకొంటూ ఆయన సాగిపోతున్నాడు. ఈ నేపథ్యంలో.. నెటిజన్లు విలువైన అంశాన్నే ప్రస్తావిస్తున్నారు. బాబుపై పెండింగ్ లో ఉన్న కేసుల పై స్టేలు తొలగిపోతే.. ఆయనకు ఎంత కాలం శిక్ష పడుతుందో? చెప్పాలని ఆయననే అడుగుతున్నారు. మరి తెలుగుదేశం అధినేత స్పందిస్తారా?
No comments:
Post a Comment