తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆయన గత నెల 24న నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న కేర్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. సాంస్కృతికశాఖలో ఆయన పలు కీలక పదవులను నిర్వహించారు. ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా నెమలి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆయన డాక్టరేట్ తీసుకున్నారు.
అష్టావధానం, నవరసావధానం, శతావధానం, ద్విశతావధానం సహా ఐదు వందలకు పైగా అవధానాలు నిర్వహించారు. ఒంటరి పూలబుట్ట, పద్య మండపం, అగ్నిహింస, ఇది కవి సమయం వంటి అనేక పుస్తకాలు రాశారు.
సాహితీ జగత్తుకి ఆయన మరణం ఒక తీరని లోటు.
మన సాహితీసేవ సమూహానికి ఆయన ఎన్నో సలహాలను అందించారు. వైభవంగా రవీంద్ర భారతిలో జరిగిన మన తొలి కార్యక్రమం విజయవంతం కావడానికి ఆయన సహాయ సహకారాలు తోడ్పడ్డాయి. ప్రతివారం మన సమూహంలో ఒక శీర్షిక నిర్వహించేందుకు కూడా ఆయన తన అంగీకారాన్ని తెలియజేసారు. ఇంతలోనే ఈ దుర్వార్త మన సమూహంలో
పంచుకోవాల్సి వస్తుందని ఊహించలేదు.
సాహితీ మాత ముద్దుబిడ్డకి మన సాహితీసేవ సమూహం "అశ్రు నివాళి" అర్పిస్తోంది cry emoticon
No comments:
Post a Comment