![]() |
ప|| అదిగాక నిజమతంబది గాక యాజకం- | బదిగాక
హౄదయసుఖ మదిగాక పరము || చ|| అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు- | నమరినది సంకల్పమను మహాపశువు ప్రమదమను యూపగంబమున వికసింపించి | విమలేంద్రియాహుతులు వేల్పంగవలదా || చ|| అరయ నిర్మమకార మాచార్యుడై చెలగ | వరుసతో ధర్మదేవత బ్రహ్మ గాగ | దొరకొన్న శమదమాదులు దానధర్మ | భాస్వరగుణాదులు విప్రసమితి గావలదా || చ|| తిరువేంకటాచలాధిపు నిజధ్యానంబు | నరులకును సోమపానంబు గావలదా | పరగ నాతనికౄపా పరిపూర్ణజలధిలో | నర్హులై యపబౄథం బాడంగవలదా || |
No comments:
Post a Comment