.
తెలంగాణ పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో చేపట్టిన 9,281 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పది రోజుల్లోనే 1.29 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆనలైన్లో దరఖాస్తులు నింపే సమయంలో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్న నియామక బోర్డు అభ్యర్థుల కోసం హెల్ప్‌లైన్, మొయిల్ ఐడీని అందుబాటులో ఉంచింది. పెద్ద సంఖ్యలో అప్లికేషన్స్ వస్తున్నప్పటికీ కొందరు ఫోటోలు సరిగా స్కాన్ చేయకపోవడం, సంతకం లేకుండా అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. ఇకపై దరఖాస్తు చేసే వారు అలాంటి తప్పులు చేయకుండా ఉండేందుకు అధికారిక వెబ్సైట్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో సూచనలు ఉంచారు. ఒక అభ్యర్ధి ఒకేసారి అప్లై చేసేందుకు అవకాశం ఉండటంతో తప్పిదాలకు అవకాశం లేకుండా, పూర్తి సమాచారాన్ని జతచేయాలని సూచిస్తున్నారు.
No comments:
Post a Comment