రాలిన అశ్రువు
----------
అసహనమో, అవమానమో
వేదనను భరించావో
ఆవేదనలను లోలోపలే అణిచేశావో..
అవమాన భారంతో కుంగిపోయావో
కులమతాల రంగుల ముఖాలను చూడలేక హడలిపోయావో
నీ లక్ష్యాన్ని ఒక్కసారి తొంగిచూడలేక పోయావెందుకో
ఆత్మపరిశీలన చేసుకోలేకపోయావెందుకో..
కులమతాల పొరలు కమ్ముకున్న సమాజానికి నీ మరణమిప్పుడు ఉత్పేరకంగా మిగిలింది

సమాజం నీ మరణానికి కావలసినన్ని రంగులు..ఊసరవెల్లి కూడా మార్చలేనన్ని రంగులతో నీ మరణానికి వెలకట్టబోతోంది
అమ్మ మరణయాతననుండి పుట్టుకొచ్చిన నువ్వు ఒక్కక్షణం ఆలోచించి ఉంటే అనాలోచిత మృత్యువు నిను తొంగి కూడా చూసేది కాదేమో
సాటి మనుషులను అవమానపరచి పొందే పైశాచికానందానికి నిదర్శనమే నేటి మనిషని గ్రహించలేక పోయావా
బంగారు భవిష్యత్తును చేతకానితనమనే కులమతాలకు ధారపోసావు
కులమతాల విషసర్పానికి కుబుసంగా రాలావు

No comments:
Post a Comment