చంద్రశేఖరా! నువ్వు మొదటిసారి ఎన్నికల ప్రచారంలో లొ, పేదలకు రెండు బెడ్ రూం ల ఇళ్ళు కట్టిస్తాను, వారు ఆత్మగౌరవం తో బతికేలా ఉంటాయి ఆ ఇళ్ళు ,అన్నప్పుడు, ...చాలా మంది ఇది ఒక ఫేక్ ప్రామీస్ అనుకున్నారు,ఇది అయ్యేది కాదు పొయ్యెది కాదు,అన్నారు,ఎగతాళి చేశారు,హేళన చేసారు.....నువ్విచ్చిన హామీ కళ్ళ ముందు కనబడేసరికి,..ముందుగా షాక్ తిన్నారు,పేదల ఇళ్ళను చూసేసరికి వారి నోట మాటపడిపొయింది,...అసహనం తో చేతులు పిసుక్కుంటున్నారు, ... ఎటువంటి అవకతవకలకు చోటియ్యకుండా,ఇలా అర్హులైన పేదలందరికి గూడు కట్టించావనుకొ నీ కీర్తి అజరామరం అవుతుంది...ఎన్నేళ్లు బతికామన్నది కాదు,ఉన్నన్నాళ్ళు ఎంత గొప్ప పని చేసామన్నదే ముఖ్యం,..."నువ్వు మా తలరాతలనే మార్చిన విధాతవు",..చరిత్ర నిన్నెన్నడూ మరచిపొదు,..నువ్వు కారణజన్ముడవు...నువ్వు చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం అవ్వాలని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ...(ఈ ఇంటి ఫొటో చూసిన మా పనిమనిషి ఆనందానికి అవధులు లేవు,..ఆమె కళ్ళు ధారాపాతంగా వర్ణించాయి).
- Ravi Kanth







No comments:
Post a Comment