Shubodayam ...My World.... Dakshina..
ఉన్నత జన్మ ఈ మానవ జన్మ.............
ఉన్నత జన్మ ఈ మానవ జన్మ.............
ఏదైనా అలవాటు చేసుకోవటం తేలికే . దానిని వదలించుకోవటమే చాలా చాలా కష్టమైన పని .
తెలియక చేసేది పొరపాటే , తెలిసి చేసేది , చేస్తున్నది అలవాటుగ పరిగణించాలి . అలా అలవాటైనవి మానాలంటే చెప్పినంత తేఇలక కాదనే చెప్పుకొని తీరాలి .
కొన్ని కొన్ని అలవాట్లు ప్రకృతి, కాల పరంగా వచ్చేవి . అలా వచ్చే అలవాట్లు ప్రకృతి , కాల పరంగా కాలక్రమంలో పోతాయి .
కొన్ని కొన్ని అలవాట్లు శారీరకంగా , ఈ శరీరాన్నంతటినీ అంతర్లీనంగా తన ఆధీనంలో ఉంచుకొని ఆధిపత్యం చెలాయిస్తున్న ఆకారమే లేని మనసు వల్ల ఏర్పడుతుంటాయి . ఈ అలవాట్లలో కొన్ని దురలవాట్ల కోవలోకి చెందినవి . అటువంటి ఆ దురలవాట్లకు ఈ ప్రాణి బానిస అయిపోతుంటుంది . అందులోంచి బయటకు రావటం అంత సులభమైన పనే కాదంటుంటారు . అది వాస్తవంలో నిజమే కావచ్చు .
ఈ ప్రపంచంలో ని సమస్త ప్రాణులలో ఈ మానవ ప్రాణులు తాము అనుకొన్నది సాధించుకొనే అవకాశాలు అధికంగానే అంది పుచ్చుకొన్నాయనే చెప్పుకోవాలి . ఆ దిశగా అడుగులు వేస్తే సాధించుకోగలరు .
దీనికి కృషి , దీక్ష , పట్టుదల , శ్రధ్ధ , క్రమశిక్షణ అంటే స్థిర సంకల్పం అన్నమాట . దీన్ని అంటిపెట్టుకొంటే ఆ దురలవాట్లను వదలించుకోగలరు .
ఈ కృషి , దీక్ష , పట్టుదల , శ్రధ్ధ , క్రమశిక్షణలు అలవరచుకోవటానికి ముందు స్థిర సంకల్పం చాలా చాలా అవసరమన్నది గ్రహించి మసులుకోవాలి . తమ జీవితాన్ని ఆనందమయంగా మలుచుకోవాలి .
ఈ అవకాశం , అవసరం ఒక్క మానవులకు తప్ప ప్రాణులకు తప్ప మరే ప్రాణులకు లేనే లేదు .
ఎందుకంటే వాటికి ఇవేమీ తెలియవు . పుడ్తున్నాయి , జీవిస్తున్నాయి , మరణిస్తున్నాయి .
అలా ఈ మానవుల జన్మ ఉండదు , ఉండకూడదు .
మిగిలిన ప్రాణులకు , మానవ ప్రాణులకు తేడా ఒక్కటే . విచక్షణా ఙ్నానం . అది ఆ మిగిలిన ప్రాణులకు బహు తక్కువ , ఈ మానవప్రాణులకు బహు ఎక్కువ .
అందుకే ఈ మానవ ప్రాణులు మిగిలిన ప్రాణులకు కూడా సాయం చెయ్యాలని ఆలోచిస్తుంటాయి.. కనుక ఈ మానవ జన్మ ఎత్తినందుకు తోటి ప్రాణులను అవసరమైన సమయంలో ఆదుకొనటంతోనే ఈ మానవ జన్మ సార్ధకత చెందుతుంది .
ఒకవేళ ఆదుకొనే శక్తి లేకుంటే , ఏ ప్రాణులకు హాని , కీడు తలపెట్టకుండా ఉన్నా ఈ మానవ జన్మ సార్ధకత చెందినట్లేనని అర్ధంచేసుకోవాలి .
అందుకనే ఈ మానవ జన్మ మహోన్నతమైనదని చెప్పబడ్తోంది , కీర్తించబడుతుంది మన వేదాలలో , అనేక గ్రంధాలలో కూడా .

No comments:
Post a Comment