UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 29 February 2016


కట్టు - బొట్టు - కట్టుబాట్లు
ఆడపిల్లలకు చిన్నతనంలో స్కర్ట్స్ , మిడ్డీస్ , స్లీవ్లెస్స్ గౌన్స్ లాంటివి వేస్తుంటారు .
ఆ తర్వాత కొంచెం 10 , 12 ఏళ్ళ వరకు పరికిణీ , జాకెట్ వేస్తుంటారు .
ఆ తర్వాత ప్రధమ రజస్వల కాగానే , ఓ మూల కూర్చోపెట్టి 4 రోజులపాటు ఎక్కడకి వెళ్ళకుండా చేసి , తెలిసిన వారిని , బంధువులను పిలచి , ఓ వేడుకగా జరుపుతారు .
ఇందులోని అంతర్భావం ఏమిటంటే , మా అమ్మాయి పెద్దమనిషి అయింది , మీకు తెలిసిన యిలాకాలో ఏవైనా మంచి పెళ్ళి సంబంధాలుంటే తెలియచెప్దురు అని .
ఈ తతంగంతో ఆ ఆడపిల్లకు వయసు ప్రభావంతో , అదనపు ఆకర్షణలుగా అగుపించే ఆ అవయవ సంపదను భద్రపరిచే సదుద్దేశంతో వస్త్రవిధానం మారుస్తారు , పరికిణీతో పాటు , జాకెట్ కొంచెం పైకి కట్టిస్తూ , ఓణీ ఒకటి అదనంగా కట్టిస్తారు .
అలా ఆ అమ్మాయిని ఎవరైనా చూస్తే , ఆ అమ్మాయికి వయసొచ్చిందని , ఆ పిల్లను పెళ్ళి చేసుకొనటానికి ఇంకొంచెం ముందుకొస్తారని అంతర్భావన .
అలా ఆ ఆడపిల్లలకు వివాహం చేసినప్పుడు , ఇంకొన్ని అదనంగా తగిలించి , బాధ్యతలుగా ఆనందిస్తారు . అవేమిటంటే పెళ్ళి . ముందు జీవితానికి ఇదొక ముఖ్యమైన ఘట్టం . ఈ ఘట్టంలో బంధువులను , పరిచయస్తులను పిలుచుకొని , అలా ఆ అందరి ఎదుట ఈ పెళ్ళి కార్యక్రమం జరిపించి , ఆశీర్వచనాలు కోరటంలో గల విశేషం ఏమిటంటే , ఈ యిరువురు భార్యాభర్తలు . వీళ్ళు దగ్గరయేటందులకు వయసు అవసరాలు తీర్చుకొనేటందులకు ,ఈ పెళ్ళి వారధి కాగలదు , ఈ యిరువురిని ఎవరూ ఎక్కడ , ఎప్పుడూ అభ్యంతర పెట్టకూడదు . ఈ యిరువురు , ఒకరికి తెలియకుండా , ఒకరు వేరొకరితో ఆ వయసు సంబంధాలు పెట్టుకొంటే , అది మనమెవ్వరం ప్రోత్సహించ కూడదు అని , ఇంకా ఈ యిరువురిలో మనస్పర్ధలు తలెత్తితే , మీరందరూ సాక్షిగా నిలచి , తగు న్యాయం చేయాలని .
ఇక ఈ పెళ్ళి తతంగంలోని అంతరార్ధం ఏమిటంటే ,
వరుడికి అంతకుముందే ఉపనయనం జరిగివుంటే , 3 దారాలు కలిపి ముడివేసిన ఒక యజ్ఞోపవీతం వేసుకొని ఉన్నట్లయితే ,యిపుడు అలాంటివి 3 ( మొత్తం )అతనికి ఎడమ భుజము నుండి కుడి నడుము వరకు వచ్చేలా వేస్తారు . దానితో అతను భవిష్యత్తులో ఏ ఆడపిల్లను చూసి మనసు పడ్డప్పుడు , నీకు పెళ్ళైంది , నువ్వు ఎలాంటి దురాలోచనలు చేయకూడదు , తప్పు అని తెలియచేసేటందులకే ఆ యజ్ఞోపవీతం .అంతేగాని వీపు దురద పెడ్తున్న ప్పుడు ( వీపు గోక్కోవటానికి వీలుపడని ప్రదేశం కనుక ) గోక్కోవటానికి కాదు అని అర్ధం చేసుకోవాలి .
ఇక వధువు విషయానికొస్తే , ఆ పెళ్ళి పేరుతో ఆమె మెడలో తాళి ( మంగళసూత్రం ) కట్టటానికే తలవంచ మన్నట్లుగా తలవంచి కడ్తాడు వరుడు . అంటే నువ్వు అతని వద్ద తలవంచి తీరాల్సిందేనని నోటితో చెప్పకనే చెప్తారు ఇలా క్రియా రూపంలో . ఆ వధువుకి కూడా నీకు పెళ్ళైనది , భర్త వున్నాడు , నీ కోరికలను , కష్టసుఖాలను అతనితోనే జరుపుకోవాలి ,అందుకోవాలి , మరెవ్వరితో పాలు పంచుకోకూడదు అని గుర్తుచేయటానికేఆమె మెడలో ఆ తాళి కట్టబడ్తుంది . కాళ్ళకు మెట్టెలు పెట్టిస్తారు వరుడి చేత . ఇంకా వాళ్ళ వాళ్ళశక్తిని బట్టి ఆభరణాలు కూడా పెడ్తుంటారు .
ఇవన్నీ కూడా ఆడవాళ్ళను ( వంటింటికే పరిమితం చేయటం వలన ) ఆకర్షించటానికి వుపయోగించబడిన అస్త్రాలు .ఐతే ఇలా ఆకర్షించటంలో స్వార్ధ చింతన కూడా యిమిడి ఉంది .
ఆడవాళ్ళ శరీర సౌష్టవం అందానికి , ఓర్పుకి , నేర్పుకి ప్రతీక
మగవాళ్ళ శరీర సౌష్టవం మొరటుతనానికి ప్రతీక .
అందువలన సంపాదించే పనులు మగవాళ్ళు తీసుకొని , ఆడవాళ్ళకు అలా సంపాదించి తెచ్చి ఇచ్చే ఆ సంపాదనను , పిల్లలని జాగ్రత్తగా చూసుకోమని అప్పజెప్పారు . అంతే కాకుండా తమ ఆడవాళ్ళ అందాలను ఎవరూ దోచుకో కూడదని వంటింటిలోనే బంధించారు . అలా బంధిస్తూ ఈ ఆభరణాలను ఎఱ చూపారు . సహజంగా స్త్రీ తన అందాన్ని పెంపొందించుకోవాలని తాపత్రయపడ్తుంటుంది ( తను అందంగా లేకపోయినా / ఉన్నా ) . అలా ఆ అందాలతో తన భర్తను ఆకర్షించి , ఆనందాలని అందించాలన్న ఆలోచనలతో ఆ చట్రంలో యిరుక్కుపోయింది .
ఇంకా యిలాంటి కొన్ని చిరు కార్యక్రమాలు , ఆ యిరువురిలో నున్న బెరుకును పోగొట్టి వారిని దగ్గర అయేలా చేస్తాయి .
రెసెప్షన్ సమయంలో ఒకరి ఎంగిలి ఇంకొకరికి తినిపిస్తారు అందరి ముందు . అంటే అందరిలో ఎంగిళ్ళు మొదలెట్టాం ,అంగిళ్ళు అక్కడ చూసుకోవచ్చు అని తెలియచేస్తుంది ఈ కార్యక్రమం .
పెళ్ళి కాగానే , పెద్దలందరి వద్దకు ఈ యిరువురిని తీసుకువెళ్ళి ఆశీర్వదించమని కోరతారు .
ఆ తర్వాత అత్తవారింటికి పంప బోయే కార్యక్రమమే అప్పగింతలు . అంటే ఇన్నేళ్ళు గారాబంగా మా అందరితో కలసి పెరిగిన ఈ పిల్లను మీకు అప్పజెప్తున్నాం , జాగ్రత్తగా చూసుకోండి అని అర్ధమన్న మాట . ఇలా చేయించే టప్పుడుఅమ్మాయి నడుముకి ఓ మానెడు ( 2 కిలోలకు పైన కొంచెం )బియ్యం పోసి ఓ తెల్ల తుండుగుడ్డతోకట్టి , ఆ నవ దంపతులను ,అక్కడ వున్న యిరు పెద్దలకు వంగి నమస్కారం చేయిస్తారు . అంటే నువ్వు ముందు ముందు గర్భవతివి అవుతావు , అప్పుడు నీవు కడుపుతో ఉన్నా ఇంటెడు చాకిరీ చేయాలి .అందులో తప్పు లేదు అని తెలియ చెప్పటం .
ఆ పై దంపత్తాంబూలాలంటూ ఆ నవ దంపతుల చేత అక్కడ వున్న దంపతులకు యిప్పిస్తారు . ఆ తర్వాత అక్కడే ఓ చిన్న వుయ్యాల వేసి , ఓ చక్క బొమ్మను పెట్టి , ఆ నవ దంపతులచేత ఉయ్యాలూపిస్తారు . అంటే మీ
యిరువురకు భవిష్యత్తులో పిల్లలు పుడ్తారు , ఆ పిల్లల్ని మీరిరువురూ పెంచాలి అని అర్ధం .
ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం , ఓ పళ్ళెంలో నీళ్ళు , పసుపు ,కుంకుమ కలిపి ఎఱ్ఱనీళ్ళుగా చేసి ఆ నీళ్ళలో ఆవధువు చేతులు ముంచి , భర్తకి , అత్త మామలకు , ఆడపడుచులకు , తోడికోడళ్ళకు , బావ మరదులకు అద్దించి అప్పజెప్తారు . అంటే మా అమ్మాయిని మీ అందరి చేతులలో పెడ్తున్నాను , కష్టం రాకుండా చూసుకోండి అని .
అలాగే 16 రోజుల పండగ వరకు తొలి రాత్రి కార్యక్రమాన్ని జరిపించేవారు కాదు . దానికి కారణం ఈ లోపల ఎవరు యిష్టపడకపోయినా , దూరమైపోవచ్చన్న అంతర్భావన ఆ పెద్దల మనసుల్లో వుంచుకొని ఇలా నడచుకొనేవారు .
ఏ పెళ్ళయిన జంటకైనా ఆ మొదటి సంవత్సరంలో ఆషాఢమాసం వస్తుంది . అపుడు కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళటం , అక్కడకి అల్లుడు రాకుండా ఆ గడప దాటకుండా , అత్తా అల్లుడు , ఒక యింటిలో వుండకూడదని ఓ ఆచారాన్నిసృష్టించారు .ఎందుకంటే కొత్తగా పెళ్ళైన ఆ జంట అంతకు మునుపే దాంపత్యం రుచి చూసిన వారవటంతో, ఆ నవ వధువులకు ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ పొంగిపొరలాలని .
అయితే యిపుడు ఆ పెద్దలు చేసే పెళ్ళిళ్ళు లేవు , యిప్పుడు దాటకూడని గడపలు లేవు , అన్నీ లాడ్జింగులే కదా ! కనుక యిపుడా సమస్యలే లేవనుకోండి .
ఇవి అన్నీ సద్భావనలే . తెలిసినవారెందరు ? తెలుసుకొని మసులుకొంటే జీవితమే ఆనందమయమే కదా !

No comments:

Post a Comment