ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. విద్యుత్ శాఖపై క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, జెన్‌కో సిఎండి డి. ప్రభాకర్ రావు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఇతర ప్రభుత్వ పథకాల కోసం వాడే విద్యుత్ బిల్లులు ప్రతీ నెలా ఖచ్చితంగా చెల్లించేలా ఆయా శాఖలకు, కలెక్టర్లకు ఆదేశాలివ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులకిచ్చే వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలతో పాటు ఇతర రాయితీల కింద విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన ప్రభుత్వ బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని సిఎం ఆదేశించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1600 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శిని సిఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారసత్వంగా రూ. 1600 కోట్ల బకాయిలను తెలంగాణకు మిగల్చడం పెద్ద భారంగా మారిందని, రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు, నిరంతర విద్యుత్ అందిస్తున్న సంస్థలను బలోపేతం చేయడానికి ఆ బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తున్నదని సిఎం అన్నారు.
No comments:
Post a Comment