సమన్వయ దృష్టి
ఈ రోజు అల్లాటప్పా రోజు కాదండీ.. ఈ రోజు చాలా స్పెషల్… క్యాలండెర్ లో ఈ రోజు రావడానికి మళ్లీ నాలుగేళ్లు పడుతుంది. గుర్తొచ్చిందా .. ఈ రోజు ఫిబ్రవరి 29. ఈ డేట్ చాలా ప్రత్యేకం.
అసలు ప్రతిసంవత్సరం ఫిబ్రవరి నెలలో 28రోజులే వస్తుంటాయి. కానీ నాలుగేళ్లకొకసారి మాత్రమే 29రోజులు ఎందుకు వస్తాయో తెలుసా?
సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందన్న విషయం తెలిసిందే. కాగా ఒకసారి భూమి సూర్యుడ్ని చుట్టి రావడానికి 365 రోజుల 5 గంటల 48 నిముషాల 46 సెకన్లు పడుతుంది. అంటే 365 రోజుల మీద ఒక పావు పూట అన్న మాట. ఈ అయిదు గంటలని ఒక రోజుగా పరిగణించలేం. అలా అని వదిలేస్తే కాలమానంతో మన కేలండర్లలో ఉన్న డేట్లు తేడా వస్తాయి. అలా ప్రతి సంవత్సరంలో వచ్చే 5 గంటల 48నిమిషాల 46సెకెన్ల కాలం నాలుగు సంవత్సరాలకొకసారి ఒకరోజుగా మారుతుంది. ఆ రోజును ఆ సంవత్సరం ఫిబ్రవరి నెలలో 29గా పరిగణిస్తారు. అలా నాలుగు సంవత్సరాల కొకసారి సంవత్సరానికి 366రోజులు వస్తాయి. దాన్ని లీపు ఇయర్ గా పిలుస్తారు.
No comments:
Post a Comment