UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 3 April 2016




తలనొప్పికి తల నరక్కోవడం మందవుతుందా??
నేటికాలంలో పెద్ద నేత దగ్గరనుండి వీధిలో తిరిగే సామాన్యుడి వరకు అందరూ కులం ఎందుకు వుండాలి అని అడుగుతున్నారు. ఆవేశం కొంత తగ్గించుకుని ఆలోచిస్తే అసలు ఎందుకు వివిధ జాతులు వచ్చాయో వాటి వలన ఉపయోగమేమిటి అన్నది అర్ధం అవుతుంది. ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఇది మొత్తం సంఘం ముందుకు నడుస్తుంది, రెండవది ఒక వ్యక్తి తన ఆధ్యాత్మికోన్నతికి దోహద పడుతుంది. ఇది అన్నీ వదిలేసిన నాలాంటి వల్లనో లేక శాస్త్రాలు చెప్పినవి మనకు అనవసరం అనుకోవడం వల్లనో కానీ మీరు ఒప్పుకోక పోవచ్చు. కానీ ఈ జాతిపితగా కీర్తింపబడే మీలో ఒకడైన, బడుగువర్గాల ఉన్నతికోసం కృషి చేసిన మహాత్మాగాంధీ చెప్పారు. ఆయన చెప్పిన అన్ని విషయాలు నాకు సమ్మతంకావుకానీ ఆయన చెప్పారు కాబట్టి వర్నాశ్రమంలో ఎన్నో మంచి విషయాలున్నాయని మీరు నమ్ముతారు.
“మన వర్ణాశ్రమ విధానం తనకు తాను తయారయ్యింది. ఎవరి శక్తికి మేర ఎవరేమి చెయ్యగలరో వారికి తగ్గ కర్మలు వారు ఎంచుకున్నారు. వారు వారి వర్నాశ్రమంలో చెయ్యవలసిన కర్మలు చెప్పబడి వున్నాయి కానీ హక్కుల ప్రస్తావన లేదు. అసలు వీటి ప్రస్తావన లేకపోయినా తాను తన వర్ణం మిగిలిన వాటికన్నా ఎక్కువ అన్న భావన అతడి ఎదుగుదలకు గొడ్డలిపెట్టు. ఈ వర్ణాశ్రమ ధర్మంలో ప్రతి వ్యక్తి తన జీవితాన్ని క్రమశిక్షణతో సాగించేందుకు, అతడి శక్తియుక్తులు సరైన పద్ధతిలో ఉపయోగపడేందుకు దోహదపడతాయి. అంటరానితనం మహా నేరం. దాని మీద నేను నిరంతరంగా పోరాడతాను కానీ వర్ణాశ్రమ ధర్మాన్ని గౌరవిస్తాను”.
ఇక్కడ సామాజిక అసమానతలను నిరశించారు. వర్ణసంకర పెళ్ళిళ్ళను ఆమోదించారు. వర్నాశ్రమం మీద గౌరవం వున్నా ఈ పద్ధతి బీటలువారింది కనుక దాన్ని మరల పునరుద్ధరించడం కుదరదని అందుకు బాహ్య విభేదాలను కూడా తున్చేయ్యాలని ఉద్దేశ్యం. వర్నాశ్రమం అనేది మన హైన్దవధర్మానికి మూలస్థంభం. దాన్ని పునరుద్ధరించలేము కాబట్టి కూల్చేయాలి అనడం బాధ్యతకు ఒక సవాలు. అసలు అటువంటి పద్ధతి లేకపోతె నేనెందుకు, నా ఉద్దేశ్యంలో ఇంకా అంతటి దౌర్భాగ్య స్థితికి మనం చేరుకోలేదు. అలాగే ఇటువంటి కులరహిత సమాజం ఎప్పటికీ కనుమరుగయ్యే అవకాశం లేదు. అందరికీ ఈ పద్ధతి గురించి అవగాహన కల్పించి శాయశక్తులా ప్రయత్నిస్తే మనం కొత్త చిగురులు తొడిగిన వారం అవుతాము.
నేటికాలంలో వేదాధ్యయనానికి మరల పునర్వైభవం వచ్చేట్టు కనబడుతోంది. చాలా చోట్ల వేదపాఠశాలలు తయారవుతున్నాయి. నా బాధ్యత అటువంటి వాటిని ప్రోత్సహించి తిరిగి మనుషులకు అందరికీ సుఖసొంతోషాలతో జీవనయానం చేస్తూ పరాన్ని చేరుకోగలిగే వాతావరణం సృష్టించడం ఈ ధర్మానికి పునర్వైభవం తేలేము కాబట్టి ఈ జ్వాల తేజస్సు తగ్గింది కానీ పూర్తిగా కొండేక్కలేదు. ఇంకా కొద్దిగా మంటవుంది, దాన్ని పునరుద్ధరించడం మన ధర్మం. ఎన్నో ఖండాలలో లేని అత్యద్భుతమైన వ్యవస్థ మన వర్ణాశ్రమ ధర్మం. చరిత్రలో వారి వ్యవస్థను వారు నాశనం చేసుకుని కనుమరుగయిన రాజ్యాలు, మతాలు ఎన్నో చూసాం. మనం కూడా మన ధర్మాలను వదిలేస్తే మనం చెల్లించుకోవలసిన మూల్యం అంతా ఇంతా కాదు. ప్రజలు వారి కులవృత్తులు, వారి కులాలు వదులుకోవడానికి కారణం యంత్రాలు, యాంత్రిక జీవన విధానం లా కనబడుతోంది. ప్రశాంతంగా సాధారణ జీవితాన్ని వదిలేసి ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నారు.
అసలు జనాలు ఈ కులాన్ని ఎందుకు ఎవగించుకున్తున్నారు? ఎందుకంటె దాని వలన సాంఘిక అసమానతలు వచ్చాయని నమ్మడం వలన. దానివలన గొడవలు రావడం, ఒకరినొకరు గౌరవిన్చుకోకపోవడం. నిజానికి అసలు ఒక జాతి గొప్పది, మరొకటి తక్కువది అన్నది లేనేలేదు. అందరూ సమానమే. ఎవరి గొప్ప వారిదే. ఈ జాతుల వలనే ఇన్ని గొడవలుఅవుతున్నాయి కనక మొత్తం ఈ కులాలను నిర్మూలించండి అని అంటున్నారు. “తల నొప్పిగా వుందని ఏ మూర్ఖుడైనా తల నరుక్కుంటాడా?” మన పురాతన ధర్మానికి ఈ కులగోడవల అనే తలనొప్పి వచ్చిందని దాన్ని బాగుపరచుకోవాలి అది మన ప్రధమ కర్తవ్యం. అంతే కానీ దానికున్న మంచిని వదిలేసి మొత్తం పద్ధతినే కూల్చడం అనేది ఏమిటి? రోగం వచ్చినవాడికి మందిచ్చి బాగుచేసుకుంటాం కానీ చంపెసుకోం కదా. ఎందుకు గొడవలు అవుతున్నాయో ఆ మర్మం తెలుసుకుని దాన్ని నిర్మూలించాలి. ఇలాగ మనం లౌకిక విషయాలను పరిష్కరించలేము. ఐదు వెళ్ళు ఒకలా వుండవు. స్పర్ధలు సర్వసాధారణం. ఉదాహరణకు ఆంధ్రా తమిళనాడు నుండి విడిపోయినప్పుడు భాషాసంఘర్షణలు వచ్చాయి. కులాలు కొట్టుకోవడం కాదు, అందరూ ఏకమై ఒకరి మీద ఒకరు దుమ్మేత్తిపోసుకున్నారు. తమిళ-తెలుగు, బెంగాలి-బిహారీ, కన్నడ-మరాఠీ, హిందీ-ఆంగ్లం ...ఇలా ఎన్నో భేదాలు. వీటిలో మీకు కులం కనబడిందా? ఇక్కడ భాష వలన గొడవలు అవుతున్నాయని అసలు మాట్లాడకూడదు, అందరం మూగవారిగా వుండాలి అని అందరి నాలికలు కత్తిరిస్తారా? మౌలిక సిద్ధాంతాల ఆధారంగా గొడవలు జరుగుతున్నాయి. అవి లెక్కలేనన్ని. ఒక పార్టీ వారంటే మరొక పార్టీ వారికి పడదు. కమ్మునిసం-పెట్టుబడిదారీ వ్యవస్థల వారు వారి భావజాలంతో కొట్టుకు చస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యం సరిఅనది అంటారు కానీ రాజకీయ కారణాల ద్వారా దాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీకి దానికి తగ్గ భావజాలం వుంటుంది. అది అందరికీ నచ్చకపోవచ్చు. అసలు ఈ భావజాలం వలన సమస్యలు వచ్చాయి కనక అసలు ప్రభుత్వాలే వుండకూడదు అనేది ఎంత అసమంజసంగా వుంటుందో, ఈ వర్ణవ్యవస్థ నిర్మూలన కూడా అంతే కళావిహీనంగా వుంటుంది. జాతుల వలన విభేదాలని జాతుల నిర్మూలన, భాషల వలన విభేదాల్ని భాషా నిర్మూలన, రాజకీయ భావజాలాల వలన గొడవల వలన అరాచకానికి తెరతీయడం ఇలా చెయ్యడం వలన ఆఖరికి మనుషుల వలనే ఈ గోదావాలని మీరు ..
ఈ జాతుల, కుల ప్రసక్తి ఎన్నికలప్పుడు విపరీతమైన ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. కేవలం రాజకీయనాయకుల పబ్బం గడుపుకోవడం కోసం ఇటువంటి వైషమ్యాలను పెంచి పోషిస్తారు. ఇటువంటి జాతులు/కులాలు వారి వారి కులానికి సంబంధించిన వృత్తులు చెయ్యకపోతే వాటికి ఆ హోదా అనవసరం. వారి వంశపారంపర్యంగా వస్తున్నా కుల వృత్తులు చేసినప్పుడే వారికి ఆ కులం అని చెప్పుకునే అర్హత వుంది. నేటి మేధావి వర్గం వర్ణ వ్యవస్థ వలన అసమానతలు కలిగాయంటున్నారు. నేనంటాను అసలు అటువంటి అసమానతలను రూపు మాపడానికే ఈ కుల వ్యవస్థ పుట్టింది అని. మనం ఒక కుటుంబంలో, ఒక కులంలో పుట్టామంటే అది మనకు ఈశ్వర ప్రసాదం. మన పూర్వజన్మ సుకృతం వలన మనకు ఈ మానవ జన్మ అందునా ఏ జాతిలో పుట్టామో అది నిర్ణయిస్తుంది. అసలు ఒకడు చేస్తున్న పని మరొకడితో పోల్చుకుని ఏమిటి లాభం. నీకిచ్చిన కర్మ నువ్వు సరిగ్గా నిర్వర్తిన్చావో లేదో తరచి చూసుకో. అనవసరంగా వ్యత్యాసాలు కొని తెచ్చుకుని ధర్మగ్లాని కల్పించకు. మనం మన నడక ద్వారా అందరికీ ఎలా జీవించాలో తెలియచేయాలి. మనం మన ధర్మాన్ని మరింత ప్రచారం చెయ్యాలి. ఏమైనా అసమానతలు ఏర్పడితే వాటిని అక్కడికక్కడ పరిష్కరించాలి తప్ప అగ్నికి ఆజ్యం పోయ్యరాదు. లేనివాడు ఉన్నవాడిని చూసి ఈర్ష్య పడతాడు- హోదా అయినా, డబ్బయినా. అసలు ఎవరి కర్మ మీద వారి దృష్టి పెడితే వారు సంతోషంగా జీవించగలరు. అసలు వర్ణాశ్రమ ధర్మాలు అందుకే వచ్చాయి. ఎవరి కర్మ వారు చెయ్యాలి. జాతులు పోయినా ఈ పేద – ధనిక సంఘర్షణ పోదు. ఇది మనం నేడు ప్రపంచం అంతా చూస్తున్నాము. అసలు సమస్యను గాలికొదిలేసి అనవసరమైన రాదాంతాలు తీసుకు వస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త........Dakshina Kali.

No comments:

Post a Comment