Pasam Jagannadham Naidu
ఎవరయినా గత చరిత్ర చూడండి..కులాల కంపు నెత్తికి ఎక్కించుకు న్న వాడు ఎన్నికలలో చిత్తు...
చిత్తూ అయ్యారు.రౌడీయిజం చేసే వాడు,చేయించే వాడు గెలిచిన సందర్భాలు అరుదు.అత్యంత అవినీతి పరుడుగా ముద్ర పడ్డ వారు కూడా గెలవడం సాధ్యం కాదు....ఒక కులంతో ఒక మతంతో....ఎవ్వరు అధికారాన్ని చేపట్టలేరు....ఏ ఒక్క కులము అయినా సమాజంలో ఐదారు శాతానికి మించి జనాభాతో లేరు.....ఆ కొద్ది మందితోప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరు అధికారం చేపట్టే పరిస్తితి కూడా ఉండదు......ప్రజలకు అందరికి దక్క వలసిన రాష్ట్ర సంపదను
కొందరుగద్దల్లా తన్నుకు పోయి,ఒక వర్గానికి,,ఒక కులానికి,ఒక , మతానికి కొన్ని కుటుంబాలకు ఏదో ఉదారంగా ,తమ అబ్బసొత్తుదానం ఇచ్చినట్టు,ప్రజల సొమ్ము దానం చేస్తా మంటే జనం స్వాగతిస్తారా? .ఒక కులానికి వ్యతిరేకంగా మాటాడే వాడు ఏకులంపట్ల అయినా అదే ద్వేషాన్ని ,విషాన్నిసమాజంపై చిమ్ముతాడు..అదే విధంగా ఒక మతం పట్ల ఉన్న ద్వేషం మరో మతంపట్ల ఉంటుంది.ఒక ప్రాంతం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసే వారికి మరో ప్రాంతం పట్ల ప్రేమ ఎలా ఉంటుంది.నాయకులు అనే వారు అన్ని వర్గాలను,కులాలను,మతాలను,ప్రాంతాలను సమానంగా చూడ గలిగిన వాడే..సాటి మనుషుల పట్ల సమానంగాఆదరాభిమానాలను వ్యక్తం చేయగలిగిన వాడే ప్రజా జీవితానికి అర్హుడు అవుతాడు
No comments:
Post a Comment