UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 8 March 2016

అతనికి 200 సొంత కార్లున్నాయి, అయినా ప్రతి రోజూ తన కటింగ్ షాప్ కు వెళ్లి కటింగ్ చేస్తాడు.!?


చరిత్రలో ఈ రోజు ? added 2 new photos.
3 hrs
అతనికి 200 సొంత కార్లున్నాయి, అయినా ప్రతి రోజూ తన కటింగ్ షాప్ కు వెళ్లి కటింగ్ చేస్తాడు.!?
ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా అణకువగా ఒదిగి ఉండాలని పెద్దల మాట. కర్ణాటకకు చెందిన రమేష్ అనే వ్యక్తికి సరిగ్గా ఇదే సూత్రం వర్తిస్తుంది. చేసేది బార్బర్ పని. అయినా ఒక్కో మెట్టూ ఎదుగుతూ వ్యాపారంలో రాణించి నేడు కోటీశ్వరుడు అయ్యాడు. అయినా ఒకప్పుడు తాను చేసిన పనిని మాత్రం విడిచిపెట్టలేదు. నామోషీ అనుకోకుండా ఇంకా అదే బార్బర్ పని చేస్తున్నాడు. ఒక వైపు వ్యాపారం, మరో వైపు తాను నమ్ముకున్న వృత్తి. ఇలా రెండింటికీ సంబంధించిన బాధ్యతలు నిర్వర్తిస్తూ అందరితో భేష్ అనిపించుకుంటున్నాడు.
కర్ణాటక వాసి అయిన రమేష్ వృత్తి రీత్యా బార్బర్‌గా పని చేసే వాడు. తన తండ్రి కూడా అదే పని చేసే వాడు. అయితే అనుకోకుండా రమేష్ తండ్రి చనిపోవడంతో వారి కుటుంబం ఒక్కసారిగా ఆర్థిక సమస్యల ఊబిలో చిక్కుకుపోయింది. దీంతో అతని తల్లి ఇరుగు పొరుగు ఇళ్లలో పనిచేసి కుటుంబాన్ని పోషించేది. తమ కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండడంతో రమేష్ పెద్దగా చదువుకోలేదు. కానీ తప్పనిసరిగా బార్బర్ వృత్తిలో కొనసాగాల్సి వచ్చింది. అయితే అతను అంతటితో ఆగిపోలేదు. ఎలాగైనా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సంకల్పించాడు. 1994వ సంవత్సరంలో తన వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ముతో ఓ చిన్న మారుతీ వ్యాన్ కొన్నాడు. దాన్ని అలాగే నిరుపయోగంగా ఉంచడం ఇష్టం లేక దాంతో కార్లను అద్దెకు ఇచ్చే వ్యాపారాన్ని ప్రారంభించాడు.
మొదట్లో రమేష్ వ్యాపారం సరిగ్గా జరిగేది కాదు. దీంతో అతను నానా అవస్థలు పడాల్సి వచ్చేది. అయినా అతను ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. అదే వ్యాన్‌తో కార్ రెంటల్ వ్యాపారాన్ని కొనసాగించాడు. అయితే ఈసారి అదృష్టం అతని తలుపు తట్టింది. అతని శ్రమ వృథా కాలేదు. ఒక్కసారిగా అవకాశాలు కలిసి వచ్చాయి. దీంతో అతని కార్ రెంటల్ బిజినెస్ ఊహించని రీతిలో పురోగతిని సాధించింది. అలా అలా అతను వ్యాపారంలో పైపైకి ఎదిగిపోయాడు. ఒక్క కారుతో ప్రారంభమైన రెంటల్ బిజినెస్ ఇప్పుడు 200 కార్లకు చేరింది. అందులో 75 విలాసవంతమైన కార్లు కూడా చేరాయి.
బీఎండబ్ల్యూ 5, 6, 7 సిరీస్, రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్ సిల్వర్ ఘోస్ట్, మెర్సిడెస్ హెచ్, ఏ, ఎస్ క్లాస్‌లు తదితర కార్లు ఇప్పుడతని దగ్గర ఉన్నాయి. వాటితోపాటు ఇతర కార్లను కూడా వినియోగదారుల అవసరాన్ని బట్టి అతను అద్దెకు ఇస్తున్నాడు. రోజుకు రూ.1వేయి మొదలుకొని రూ.50వేల రేంజ్‌లో లభించే అద్దె కార్లు అతని దగ్గర ఉన్నాయి. వాటిని అధిక శాతం సినిమా స్టార్లు, షూటింగ్‌ల కోసం అద్దెకు తీసుకువెళ్తుంటారు.
అయితే అంత పెద్ద కార్ రెంటల్ బిజినెస్‌కు యజమాని అయినా తన వృత్తిని మాత్రం రమేష్ మరువలేదు. ఇప్పటికీ రోజులో ఏదో ఒక సమయంలో తన షాపుకు వెళ్లి బార్బర్ పనిచేస్తుంటాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది. అతను తన బిజినెస్ పుణ్యమా అని బాలీవుడ్ స్టార్లకు కటింగ్ చేయడం కూడా మొదలు పెట్టాడు. సాధారణ కటింగ్‌తోపాటు విలాసవంతమైన కటింగ్‌ను అతను చేయగలడు. బాలీవుడ్ స్టార్లయిన సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్‌లు, బెంగుళూరులో పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు కూడా రమేష్ దగ్గరికి వచ్చి కటింగ్ చేయించుకుని వెళ్తారు. ఇంత ఎత్తుకు ఎదిగినా రమేష్ ఇప్పటికీ సాధారణ వ్యక్తిలాగే కనిపిస్తాడు. తన పిల్లలకు హెయిర్ కటింగ్‌లో మెళకువలను కూడా నేర్పిస్తున్నాడు. జీవితంలో పైకి రావాలనుకునే వారికి రమేష్ ఇస్తున్న సలహా ఒక్కటే. అదేమిటంటే కష్టపడండి, నిజాయితీగా ఉండండి, అదృష్టం మిమ్మల్ని ఏదో ఒక రోజు వరిస్తుంది, అప్పుడు తప్పక మీరూ హీరోలవుతారు

No comments:

Post a Comment